Begin typing your search above and press return to search.
ఎట్టకేలకు స్టార్ హీరోయిన్ కు పోలీసు నోటీస్
By: Tupaki Desk | 24 July 2020 11:50 AM GMTబాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ రాజ్ పూత్ ఆత్మహత్య కేసులో ముంబయి బాంద్రా పోలీసులు దాదాపుగా 40 మందిని ప్రశ్నించారు. కేసుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రముఖులను ప్రశ్నించారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నప్పటి నుండి కూడా హీరోయిన్ కంగనా పదే పదే ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేస్తూ ఉంది. సోషల్ మీడియాలో ఆమె చేస్తున్న పోస్ట్ లు మరియు కొన్ని రోజుల క్రితం ఆమె ప్రముఖ జాతీయ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను చెప్పుకొచ్చింది. దాంతో సుశాంత్ కేసులో ఆమెను కూడా విచారించాలనే పోలీసులు నిర్ణయించుకున్నారు.
ముంబయిలోని ఆమె ఇంటికి విచారణకు హాజరు అవ్వాలంటూ నోటీసులు పంపించడం జరిగింది. కరోనా కారణంగా కంగనా ప్రస్తుతం ముంబయిలో ఉండటం లేదు. హిమాచల్ ప్రదేశ్ లోని మనాలీలోని తన సొంత ఇంట్లో ఉంది. ముంబయిలోని ఇంట్లో ఉన్న వారు ఎవరు కూడా ఆ నోటీసులు తీసుకునేందుకు ఒప్పుకోలేదు. అయినా కూడా కంగనాకు నోటీసులు ఇచ్చినట్లుగా పోలీసులు ప్రకటించి ఆమెను విచారణకు రావాల్సిందే అంటూ సూచించారు. అయితే కంగనాకు అఫిషియల్ గా నోటీసు అందని కారణంగా విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదు అంటూ కంగనా మేనేజర్ కమ్ సోదరి అయిన రంగోలీ అభిప్రాయం వ్యక్తం చేసింది.
పోలీసులు కంగనా టీంకు మద్య జరిగిన వాదోపవాదన తర్వాత ఎట్టకేలకు మనాలీకి నోటీసులను పోలీసులు పోస్ట్ చేశారు. అతి త్వరలోనే పోలీసుల నోటీసు కంగనాకు చేరే అవకాశం ఉందని త్వరలోనే ఆమెను పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాల వారు అంటున్నారు. ఆ సమయంలో ఆమె బాలీవుడ్ ప్రముఖులపై తీవ్ర ఆరోపణలు చేయడంతో పాటు మాఫియా అంటూ సంభోదిస్తూ వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది. కనుక కంగనా చెప్పబోతున్న విషయాలు సుశాంత్ కేసును తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు అంటున్నారు.