Begin typing your search above and press return to search.
సితార డాన్స్ పై మమ్మీ-డాడీ టెన్షన్!
By: Tupaki Desk | 15 April 2022 11:30 PM GMTలిటిల్ ప్రిన్సెస్ ఘట్టమనేని వారసురాలు సితార ప్రతిభ గురించి చెప్పేదేముంది. తండ్రి కి తనయురాలిగా నెట్టింట ఫేమస్ అవుతుంది. తనదైన శైలి డాన్సు వీడియోలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఇటీవలే కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చి మహేష్ ని గర్వంగా ఫీలయ్యేలా చేసింది. ఓ తండ్రికి అంతకు మించిన బెస్ట్ మూవ్ మెంట్ ఏముంటుంది. కూచిపూడి నృత్యంపై శిక్షణ ఇప్పించి సీతమ్మనే దిగొచ్చి నాట్యం చేస్తే అలా ఉంటుందా? అనిపించింది.
ఉత్తరాది ఆడియన్స ని ఆ వీడియో ఎంతగానో మెప్పించింది. ఇక 'సర్కారు వారి పాట'లోనూ 'పెన్నీ' పాటలో డాన్సుతో మెప్పించిన సంగతి తెలిసిందే. మహేష్ స్టెప్పుల్ని దించేసింది. సాంగ్ లో సితార ఇంట్రడక్షన్ అదిరిపోయింది.
తాజాగా ఈ పాట కోసం సితార ని ఎంపిక చేసిన తర్వాత నమ్రత-మహేష్ ఎంత టెన్ష్ ఫీలయ్యారు అన్నది తాజాగా నమ్రత రివీల్ చేసారు. సితారకి డాన్స్ అంటే పిచ్చి. అందుకే ఆరంగంలో శిక్షణ తీసుకుంటుంది. డాన్సు వీడియోల్ని నెట్టింట తెగ షేర్ చేస్తుంటుంది.
'కళావతి' పాటకు ఇన్ స్టా రీల్ చేసి షేర్ చేసింది. అది చూసిన తమన్ 'పెన్నీ' పాటకు సితారతో డాన్స్ చేయిస్తే బాగుంటుందని అన్నారు. ఈ విషయం మహేష్..సితారకి చెబితే ఎగిరి గంతేసారు. అలా పాటలో సితారని భాగం చేసాం. ఓ పాట కోసం కెమెరా ముందుకొచ్చి డాన్స్ చేయడం ఇదే మొదటిసారి. దీంతో ఎలా చేస్తుందోనని మహేష్..నేను చాలా టెన్షన్ పడ్డాం.
కంగారు కి గురయ్యాం. అనుకున్న విధంగా వీడియో వస్తే దాన్ని విడుదల చేద్దాం. లేకపోతే సితారని తప్పిద్దాం అనుకున్నాం. కానీ సితార బాగా చేసింది. డాన్సుతో అందర్నీ ఆశ్చర్య పరిచిందని నమ్రత తెలిపారు. సితార ఇంత షైన్ అవ్వడం వెనుక నమ్రత కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. తల్లిగా ఆమె తీసుకోవాల్సిన అన్ని రకాలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఓ వైపు చదువు ఎక్కడా డిస్టర్బ్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చదువుతో పాటు ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్ లోనూ తరుచూ పాల్గొనేలా..వాటి పట్ల ఆకర్షణ కలిగేలా చిన్న నాటి నుంచి ప్రేరేపిస్తున్నారు. సితార అంటే మహేష్ కి ప్రాణం. సీతాపాప అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. షూటింగ్ లు లేకపోతే ఇంట్లో ఖాళీ సమయాన్ని సితారతోనే గడుపుతారు. ఇక గౌతమ్ ప్రస్తుతం పూర్తిగా చదువుపైనే దృష్టిసారించినట్లు కనిపిస్తుంది.