Begin typing your search above and press return to search.

డైరెక్టర్‌ ను చెప్పుతో కొట్టా : పవన్‌ హీరోయిన్‌

By:  Tupaki Desk   |   23 Oct 2018 1:30 AM GMT
డైరెక్టర్‌ ను చెప్పుతో కొట్టా : పవన్‌ హీరోయిన్‌
X
సినిమా పరిశ్రమలో లైంగిక వేదింపు కొత్తేం కాదు. కాని ఇంత కాలం ఆ లైంగిక వేదింపుల గురించి బయటకు చెప్పేందుకు ఏ ఒక్కరు కూడా మీడియా ముందుకు రాలేదు. కొందరు మీడియా ముందుకు వచ్చి చెప్పే ప్రయత్నం చేసినా కూడా వారి గొంతు నొక్కేవారు. కాని ప్రస్తుత పరిస్థితి మారిపోయింది. మీటూ ఉద్యమంలో భాగంగా ప్రముఖ స్టార్స్‌ పై కూడా లైంగిక ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా ఈ విషయమై పవన్‌ కళ్యాణ్‌ తో ‘ఖుషి’ చిత్రంలో నటించిన ముంతాజ్‌ స్పందించింది. తమిళ బిగ్‌ బాస్‌ తో అక్కడ బాగా ఫేమస్‌ అయిన ఈమె ఒక ఇంటర్వ్యూలో మీటూ పై స్పందించింది.

లైంగిక వేదింపుల బాధితుల జాబితాలో నేను కూడా ఉన్నాను. పలు సార్లు నేను లైంగికంగా వేదించబడ్డాను. అయితే వాటిని నేను ఓపిక ఉన్నంత వరకు భరించేదాన్ని, అంతకు మించి నన్ను విసిగిస్తే, లైంగికంగా వేదిస్తే మాత్రం సీరియస్‌ గా స్పందించేదాన్ని. ఒక సినిమా షూటింగ్‌ సమయంలో నాతో దర్శకుడు పదే పదే అసభ్యంగా ప్రవర్తించడంతో సహనం కోల్పోయి అతడిని చెప్పుతో కొట్టాను. అప్పుడు అంతా షాక్‌ అయ్యారు. ఘాటుగా స్పందిస్తే తప్ప లైంగిక వేదింపు నుండి ఆడవారు బయట పడలేరు అంటూ ముంతాజ్‌ చెప్పుకొచ్చింది.

ఇక మీటూ ఉద్యమంలో తాను భాగస్వామి కాదల్చుకోలేదని చెప్పుకొచ్చింది. తనకు ఎదురైన అనుభవాలను చెప్పాను తప్ప, ఇవి మీటూ ఉద్యమంలో భాగం కాదు అంటూ పేర్కొంది. మీటూ అంటూ సెలబ్రెటీలపై ఆరోపణలు చేస్తున్న వారు వాటిని నిరూపించేందుకు సిద్దంగా ఉండాలని, అలా లేని పక్షంలో వారు ఆరోపణలు చేయకపోవడం మంచిదని, కేవలం నిందలు వేసి పబ్బం గడిపేయాలని భావిస్తే అది మంచి పద్దతి కాదంటూ ఈ సందర్బంగా ముంతాజ్‌ పేర్కొంది.