Begin typing your search above and press return to search.
ప్రభాస్ హీరోయిన్ పై క్రిమినల్ కేసు
By: Tupaki Desk | 27 Dec 2017 1:06 PM GMTబాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ కు బోలెడంత క్రేజ్ మాత్రమే కాదు.. అంతకు మించిన ట్యాలెంట్ కూడా ఉంది. సినిమాల ఎంపికలో మహా చాతుర్యం చూపించేసే ఈ బ్యూటీ కెరీర్ లో.. హిట్స్ పర్సంటేజ్ బాగా ఎక్కువ. కానీ రీసెంట్ గా ఈ సుందరి నటించిన హసీనా మాత్రం చేదు అనుభవాలనే మిగిల్చింది. దావూద్ సోదరి అయిన హసీనా జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం కారణంగా.. శ్రద్ధా కపూర్ కెరీర్ లో భారీ డిజాస్టర్ జతయింది.
బాహుబలి తర్వాత ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సాహో మూవీలో హీరోయిన్ అయిన శ్రద్ధా కపూర్ పై ఓ క్రిమినల్ కేసు నమోదు కావడం ఇప్పుడు సెన్సేషన్ అయిపోతోంది. ఇందుకు కారణం కూడా హసీనా చిత్రమే. సహజంగా సినిమాల కోసం షూటింగులతో పాటే బ్రాండింగ్ అగ్రిమెంట్స్ కూడా చేసుకుంటారు. ఇందులో భాగంగా ఎం అండ్ ఎం డిజైన్స్ అనే కంపెనీతో.. వీరి బ్రాండ్ అయిన ఏజేటీఎంకు ప్రచారం చేసేలా ఒప్పందం చేసుకున్నారట హసీనా మూవీ టీం. తీరా ప్రచారం దగ్గరకు వచ్చేసరికి.. ఈ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారట.
ఇలా ప్రచారం చేయాల్సిన బాధ్యత.. అటు హీరోయిన్ పై.. ఇటు ప్రొడ్యుసర్ పై ఉంటుందనేది అగ్రిమెంట్. కానీ ఈ కాంట్రాక్టుకు భిన్నంగా వ్యవహరించడంతో.. ఈ బ్రాండ్ వర్గాలు క్రిమినల్ కేసు నమోదు చేశారు. అసలు ఎందుకు ఇలా బ్రాండింగ్ అగ్రిమెంట్ ను బ్రేక్ చేశారనే విషయంపై ప్రస్తుతం పోలీసుల విచారణ సాగుతుండగా.. ఇందుకు శ్రద్ధా కపూర్ కూడా సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది.