Begin typing your search above and press return to search.

MAA ని ఐదు సార్లు పాలించిన ఆయ‌నేమ‌న్నారు?

By:  Tupaki Desk   |   8 Oct 2021 9:30 AM GMT
MAA ని ఐదు సార్లు పాలించిన ఆయ‌నేమ‌న్నారు?
X
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) అసోసియేష‌న్ కి చిరంజీవి - కృష్ణ‌- నాగ‌బాబు త‌దిత‌రులు అధ్య‌క్షులుగా కొన‌సాగారు. ఆ త‌ర్వాత ముర‌ళీమోహ‌న్ ఏకంగా ఐదు సీజ‌న్ల‌కు అధ్య‌క్ష ప‌ద‌విలోనే ఉన్నారు.
5సార్లు అధ్యక్షులు గా.. 3 సార్లు జనరల్ సెక్రటరీగా ముర‌ళీమోహ‌న్ ప‌ద‌వులు చేప‌ట్టి ప‌ని చేసారు. జనరల్‌ సెక్రటరీగా ఆయ‌న చిరు-కృష్ణ అధ్య‌క్షులుగా ఉన్న స‌మయంలో ప‌ని చేశారు. 1993 నుంచి 99 వ‌ర‌కూ ఆయ‌న ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగానే కొన‌సాగారు. అధ్యక్షులుగా..1999-2000 ..2002-04..2008-10..2010-12.. 2013-15 ఇలా ఐదు ద‌ఫాల‌కు ప‌ని చేశారు.

అయితే మూవీ ఆర్టిస్టుల ఎన్నిక‌ల్లో ర‌భ‌స‌పై ఆయ‌నేమంటున్నారు. ఒక‌రిపై ఒక‌రు విద్వేషాన్ని కోపాన్ని క‌లిగి ఉన్నారు. మీడియా మీటింగుల్లో బ‌య‌ట‌ప‌డుతూనే ఉన్నారు. ఒకే కుటుంబంలా క‌లిసి ఉంటాం అంటూనే క‌క్ష‌లు సాధింపుల‌కు తెర తీస్తూ జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్స్ లా మార్చేశారు. ఇదంతా అవ‌స‌ర‌మా? అని ముర‌ళీమోహ‌న్ ని ప్ర‌శ్నిస్తే.. నేటిత‌రం ఔత్సాహికుల హ‌డావుడి ఇది అంటూ న‌వ్వేశారు. ఎవ‌రు గెలిచినా అంద‌రూ మా కు సేవ చేయాల‌ని పేద క‌ళాకారుల‌కు ఉపాధిని క‌ల్పిస్తూ తిండికి లోటు రాకుండా చూడాల‌ని ఆరోగ్య కార్డుల‌ను అంద‌జేయాల‌ని కూడా ముర‌ళీ మోహన్ సూచించారు. గొడ‌వ‌ల్లేకుండా క‌లిసి మెలిసి ప‌ని చేయాల‌ని ఒక సీనియ‌ర్ గా సూచించారు.

ఐదు ద‌ఫాలున్నా `మా`కు సొంత భ‌వంతి తేలేదు!

మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌ల వేళ‌ వివాదాల‌న్నీ `మా సొంత భ‌వంతి` నిర్మాణం చుట్టూనే తిరుగుతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు ఆర్టిస్టుల సంఘం ద‌శాబ్ధాల పాటు మ‌నుగ‌డ సాగిస్తున్నా.. దాదాపు 950 మంది స‌భ్యుల‌తో సౌత్ లోనే అతి పెద్ద అసోసియేష‌న్ గా వెలిగిపోతున్నా కానీ `మా`కు సొంత భ‌వంతి లేక‌పోవ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ముర‌ళీ మోహ‌న్ తేదేపా హ‌యాంలోనే ట్రై చేసి విఫ‌ల‌మైన సంగ‌తి తెలిసిన‌దే.

అయితే ఇన్నేళ్ల‌లో మా అసోసియేష‌న్ కి సొంత భ‌వంతి కోసం ప్ర‌య‌త్నాలు సాగ‌లేదా? అంటే.. ప్ర‌తిసారీ ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నా ఫెయిల‌య్యామ‌ని ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు అంగీక‌రించారు. తెలుగుదేశం ప్ర‌భుత్వం హ‌యాంలోనే ముర‌ళీమోహ‌న్ ప్ర‌య‌త్నించారు. కానీ ప‌న‌వ్వ‌లేదు. ఆ త‌ర్వాత వైయ‌స్సార్ ప్ర‌భుత్వాన్ని ముర‌ళీమోహ‌న్ మా భ‌వంతి కోసం ఎక‌రం భూమి అడిగారు. కానీ కాంగ్రెస్ డోర్స్ మూసేసింద‌ని నాగ‌బాబు తెలిపారు. కానీ ముర‌ళీమోహ‌న్ గ‌ట్టిగా ప్ర‌య‌త్నించి ఉంటే అయ్యేద‌ని కూడా అన్నారు.

నిజానికి ఏపీ తెలంగాణ డివైడ్ అనే అంశం కూడా మా సొంత భ‌వంతి నిర్మాణం ఆగిపోవ‌డానికి కార‌ణ‌మ‌ని నాగ‌బాబు న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్యానించారు. అప్ప‌ట్లో తాము భ‌వంతి నిర్మాణం కంటే వెల్ఫేర్ కార్య‌క్ర‌మాల వైపు మొగ్గు చూపాని తెలిపారు. తాను అధ్య‌క్షుడిగా ఉన్న‌ హ‌యాంలోనూ మా సొంత భ‌వంతి కోసం ప్ర‌య‌త్నించినా ప‌ని కాలేద‌ని తెలిపారు.

మా సొంత భ‌వంతి నిర్మాణం విష‌యంలో ప్ర‌కాష్ రాజ్.. మంచు విష్ణు ఎవ‌రికి వారు పూర్తి క్లారిటీతో ఉన్నామ‌ని తెలిపారు. స్థ‌ల సేక‌ర‌ణ స‌హా ప్ర‌తిదీ ఏం చేయాలో మీడియా మీటింగుల్లో ఆ ఇద్దరూ చెబుతున్నారు.