Begin typing your search above and press return to search.

ముర‌ళి మోహ‌న్ వార‌సుడు ఛాన్సులు అలా మిస్ అయ్యాడు !

By:  Tupaki Desk   |   24 Jun 2023 11:59 AM GMT
ముర‌ళి మోహ‌న్ వార‌సుడు ఛాన్సులు అలా మిస్ అయ్యాడు !
X
సినిమా ఇండ‌స్ట్రీ లో ట్యాలెంట్ ఉంటే వార‌సుల‌దే హ‌వా. వాళ్ల‌కి ఎంట్రీ ఈజీగా ఉంటుంది. పెద్ద‌గా శ్ర‌మించాల్సిన ప‌నిలేదు. అప్ప‌టికే రూట్ క్లియ‌ర్ గా ఉంటుంది. స్పెష‌ల్ ట్రైనింగ్ గ‌ట్రా అన్ని స్ట‌డీస్ తో పాటే న‌డుస్తుంటాయి. కాబ‌ట్టి మ‌రీ ట్యాలెంటెడ్ కాక‌పోయినా ఎంట్రి ఇచ్చిన త‌ర్వాతైనా షైన్ అవ్వ‌డానికి అవ‌కాశం ఉంటుంది. ఇప్పుడు ఇండ‌స్ట్రీని ఏల్తోన్న వార‌సులంతా! అలా వ‌చ్చిన వారే.

మెగా వార‌సులు..నంద‌మూరి వార‌సులు.. అక్కినేని వార‌సులు..ద‌గ్గుబాటి వార‌సులు ఇలా కొన్ని *****వార‌స‌త్వాలు టాలీవుడ్ లో కొన‌సాగుతున్నాయి. త‌మ త‌రం కొన‌సాగించ‌డం కోసం తన‌యుల్ని సైతం రంగంలోకి దించుతున్నారు. అయితే సీనియ‌ర్ న‌టుడు మురుళి మోహ‌న్ వార‌స‌త్వం మాత్రం టాలీవుడ్ లో లేద‌నే చెప్పాలి. న‌టుడిగా మురళి మోహ‌న్ ప్ర‌స్తానం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

ఎన్నో సినిమాల్లో న‌టించారు. మ‌రెన్నో చిత్రాల్ని నిర్మించారు. ఇక వ్యాపార సామ్రాజ్యంలో ఓ మ‌హా వృక్షంలాగే ఎదిగారు. ఇప్పుడా చెట్టు ఎంతో మందికి నీడ‌ని అందిస్తుంది. ఇలా ఇంత పేరున్న ముర‌ళీ మోహ‌న్ వార‌సులు ఎవ‌రూ కూడా టాలీవుడ్ లో లేక‌పోవ‌డం అభిమానుల్ని కాసింత బాధ‌పెట్టే అంశమే. ముర‌ళీ మోహ‌న్ కి కుమార్తె...కుమారుడు ఉన్నా వాళ్లెవ్వ‌రూ సినిమా రంగం వైపు రాలేదు.

ఈ నేప‌థ్యంలో సినిమాలంటే ముర‌ళీ మోహ‌న్ కి న‌చ్చ‌కే ఇటువైపు తీసుకురాలేద‌ని చాలా కాలంగా ఓ విమ‌ర్శ ఉంది. అయితే సినిమాలంటే ఆయ‌న‌కు కాదు..వాళ్ల పిల్ల‌ల‌కు ఇష్టం లేక ఈ రంగాన్ని ఎంచుకున్న‌ట్లు లేద‌ని తాజాగా ముర‌ళీ మోహ‌న్ వ్యాఖ్య‌ల్ని బ‌ట్టి తెలుస్తుంది. కుమారుడు కి డిగ్రీ అయిన త‌ర్వాత హీరోగా అవ‌కాశాలు వ‌చ్చాయ‌ట‌. కానీ అమెరికాలో ఎంబీఏ చేస్తాను అన్నాడు.

కుమారుడి కోరిక మేర‌కు అక్క‌డ ఎంబీఏ పూర్తిచేసాడు. ఆ త‌ర్వాత ఇండియాకి వ‌చ్చిన త‌ర్వాత కూడా అవ‌కాశాలు వ‌చ్చాయ‌ట‌. అప్పుడు వ్యాపారం చేస్తాన‌ని అన్నాడు. అలా కుమారుడు సినిమాల్లోకి రాన‌ట్లు తెలుస్తుంది.

ఇక అమ్మాయి పీజీ అయ్యాక పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిర ప‌డిన‌ట్లు తెలిపారు. అలాగే ముర‌ళీ మోహ‌న్ త‌మ్మ‌డు బిడ్డ‌లు కూడా వివిధ రంగాల్లో స్థిర‌ప‌డ్డారు తప్ప ఎవ‌రూ మ్యాక‌ప్ వేసుకునే ప్ర‌య‌త్నం చేయ‌లేద‌ని అన్నారు.