Begin typing your search above and press return to search.
ఆ మూవీతో మురళీమోహన్ మొత్తం పోగొట్టుకున్నాడట
By: Tupaki Desk | 24 Jun 2019 11:48 AM GMTతెలుగు ప్రజలకు ఏమాత్రం పరిచయం చేయాల్సిన అవసరం లేని నటుల్లో మురళీమోహన్ ఒకరు. సినీనటుడిగా స్టార్ హోదా సంపాదించుకోకున్నా.. ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా పట్టేసిన నటుడిగా చెప్పాలి. విచిత్రమైన విషయం ఏమంటే.. వెండితెరను ఏలేసిన మొనగాడు నటులు కూడా సంపాదించలేనంత సంపదను సంపాదించిన టాలెంట్ మాత్రం మురళీమోహన్ దే.
అలాంటి ఆయన.. తాను సంపాదించిన మొత్తం డబ్బుల్ని ఒక్క సినిమాతో పోగొట్టుకున్నట్లుగా చెప్పిన ఆశ్చర్యపర్చారు. కాకుంటే.. ఆయన చెప్పిన మాట ఇప్పటిది కాదు.. గతానికి చెందింది. ఇంతకీ ఆ ఆసక్తికర ముచ్చటేమంటే.. అప్పట్లో మణిరత్నం దర్శకత్వంలో ఎంజీఆర్.. కరుణానిధి కథతో తెరకెక్కించిన ఇద్దరు అన్న సినిమా ఉంది కదా? ఆ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని భారీ మొత్తానికి కొనుగోలు చేశారట.
అయితే.. సినిమా మొదటి ఆటకే ప్లాప్ టాక్ రావటం.. రెండో ఆటకు థియేటర్లలో జనాలు కనిపించకుండా పోవటంతో ఆ సినిమా మీద పెట్టిన మొత్తం పోయిందట. అప్పటివరకూ సంపాదించిందంతా ఆ సినిమాతో పోగొట్టుకోవాల్సి వచ్చినట్లు చెప్పారు. తర్వాత కాలంలో డిస్ట్రిబ్యూషన్ లోని వాటాదార్లు చేసిన మోసంతో మరో దెబ్బ తగిలింద్నారు. దాంతో.. రియల్ మీద మురళీమోహన్ చూపు పడింది. అలా స్టార్ట్ అయిన బిజినెస్ లో ఆయన మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అలా తనకు ఎదురుదెబ్బలు ఎదురైనా.. ధైర్యంగా ముందుకెళ్లానని.. నిజాయితీతో నిలబడినట్లుగా చెప్పారు. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. ఒక్క మాట అయితే నిజం.. అదేమంటే.. కష్టం వచ్చినప్పుడు బెంబెలెత్తి పోవటం కంటే.. ఆశావాహ దృక్పధంతో ప్రయత్నిస్తే ఫలితం పక్కా. అందుకు మురళీమోహన్ సాక్ష్యంగా చెప్పక తప్పదు.