Begin typing your search above and press return to search.

ఫొటోటాక్ : 'ఖిలాడి' పుట్టపర్తి గా విలక్షణ నటుడు

By:  Tupaki Desk   |   31 Jan 2022 2:36 PM GMT
ఫొటోటాక్ : ఖిలాడి పుట్టపర్తి గా విలక్షణ నటుడు
X
రవితేజ హీరోగా డింపుల్‌ హయతి హీరోయిన్ గా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన 'ఖిలాడి' సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఖిలాడి ప్రమోషన్‌ ను మొదలు పెట్టారు. ఈ సినిమా నుండి మెల్ల మెల్లగా ఒక్కో పాత్రను రివీల్‌ చేస్తున్నారు. ఇటీవలే హీరోయిన్ డింపుల్‌ హయతి లుక్ ను రివీల్‌ చేసిన మేకర్స్ తాజాగా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్న మురళి శర్మ లుక్ ను రివీల్‌ చేయడం జరిగింది. ఈ సినిమాలో మురళి శర్మ విభిన్నంగా పుట్టపర్తి అనే పాత్రలో కనిపించబోతున్నాడు. లుక్ చూస్తుంటే చాలా ఫన్నీగా ఉంటుందనే అనిపిస్తుంది. విలన్ గా కమెడియన్ గా మురళి శర్మ ఎలా నటించినా కూడా ఆ పాత్రకు పూర్తిగా న్యాయం చేస్తాడు అనడంలో సందేహం లేదు.

ఖిలాడి సినిమాలో పుట్టపర్తిగా మురళి శర్మ ప్రేక్షకులను అలరించబోతున్నట్లుగా లుక్ చూస్తుంటేనే అర్థం అవుతోంది. ఆరోగ్య జాగ్రత్తలు ఎక్కువ తీసుకునే వ్యక్తి పాత్రలో మురళి శర్మ కనిపించబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెప్పుకొచ్చారు. చాలా సింపుల్‌ పైజామా లుక్ లో మురళి శర్మ కనిపించబోతున్నాడు. నుదుట బొట్టు పెద్ద మనిషి తరహాలో కళ్ల జోడు ఇలా ఆయన పాత్రను దర్శకుడు డిజైన్‌ చేసిన తీరు ఆకట్టుకునే విధంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

రవితేజ ఈ సినిమా పై చాలా నమ్మకంతో ఉన్నాడు. క్రాక్‌ సినిమా తర్వాత రవితేజ నుండి ఈ సినిమా గత సమ్మర్ లోనే రావాల్సి ఉన్నా కూడా కరోనా వరుస వేవ్‌ ల కారణంగా వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఈ సినిమాను ఫిబ్రవరి 11న విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు. ఈ తేదీన కూడా విడుదల ఉంటుందా అనే అనుమానం వ్యక్తం అయ్యింది. అలాంటి సమయంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పాటు థియేటర్ల వద్ద మళ్లీ మునుపటి పరిస్థితులు కనిపించబోతున్నాయి. కనుక ఖిలాడి సినిమాను విడుదల చేస్తారని తెలుస్తోంది. గతంలో క్రాక్‌ సినిమా విడుదల సమయంలో కూడా కరోనా కారణంగా జనాలు వస్తారా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. సినిమా కు పాజిటివ్ టాక్‌ వస్తే తప్పకుండా జనాలు క్యూ కడుతారు అని క్రాక్ సినిమా నిరూపించింది. అందుకే క్రాక్ సినిమాను అనుకున్నట్లుగానే ఫిబ్రవరి 11న విడుదల చేయబోతున్నారు. ఖిలాడి సినిమా కనుక పాజిటివ్‌ టాక్ దక్కించుకుని భారీ వసూళ్లను దక్కించుకుంటే తప్పకుండా మరిన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.