Begin typing your search above and press return to search.
పెళ్లాం చెబితే వినాలి
By: Tupaki Desk | 8 May 2018 4:39 AM GMTఇంతవరకు ఎప్పుడూ చేయని డిఫరెంట్ రోల్ చేయడమంటే ప్రతి యాక్టర్ గ్యారంటీగా ఇష్టపడతాడు. పాత్ర కోసం కొత్తగా ఏదైనా నేర్చుకోవాల్సి వచ్చినా.. కొంత ఇబ్బంది పడాల్సి వచ్చినా దానిని కేర్ చేయకుండా సై అనే నటులు ఇండస్ట్రీలో కొంతమందే ఉంటారు. బాలీవుడ్ పాపులరయి టాలీవుడ్ కు వచ్చిన మురళీశర్మ ఇలాగే ఓ పాత్ర కోసం కొత్త భాషలో పట్టు నేర్చుకునేందుకు పాఠాలు నేర్చుకోవడం మొదలెట్టాడు. అది వేరెవరి దగ్గరో కాదు.. తన భార్య దగ్గరే.
డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన కొడుకు ఆకాష్ పూరి హీరోగా మెహబూబూ సినిమా తీస్తున్నాడు. దాయాది దేశాలైన భారత్ - పాక్ లకు చెందిన జంట కథతో ఈ సినిమా వస్తోంది. ఇందులో మురళీ శర్మ ఆయన భార్య అశ్విని పాకిస్తానీ దంపతులుగా నటిస్తున్నారు. ఈ రోల్ కోసం స్వచ్ఛమైన ఉర్దూలో ధారాళంగా డైలాగులు చెప్పాలి. మురళీశర్మకు ఉర్దూ ఆ రేంజిలో రాదు. కానీ ఆయన భార్య అశ్వనికి మాత్రం బ్రహ్మాండంగా వచ్చట. అదెలాగంటే హిందీలో వచ్చిన జోధా అక్బర్ సీరియల్ లో రెండేళ్లపాటు ఓ రోల్ చేసింది. దాంతో ఆమెకు ఉర్దూ బాగానే వచ్చేసింది.
దీంతో మురళీశర్మ డైలాగుల్లో పర్ ఫెక్షన్ వచ్చేలా భార్య దగ్గరే పాఠాలు నేర్చుకోవడం మొదలెట్టాడు. సెట్ లో డైలాగులు నేర్పించే విషయంలో అశ్వని అచ్చం స్కూల్ లో టీచర్ లాగే వ్యవహరించింది అంటున్నాడు మురళీ శర్మ. ఆమె యాక్టరయింది కాబట్టి సరిపోయింది గానీ.. అదే టీచరయి ఉంటే స్టూడెంట్లంతా కిటీకీలు దూకి పారిపోయేవాళ్లు. ఆ రేంజిలో నన్ను ట్రయిన్ చేసింది అంటూ నవ్వుతూ చెప్పుకొస్తున్నాడు. ఇంత కష్టపడ్డందుకు మెహబూబూ సినిమాలో తమ రోల్ ప్రేక్షకులను మెప్పిస్తుందని నమ్మకంతో ఉన్నాడు.