Begin typing your search above and press return to search.
ఎవరయ్యా ఈ మురళీ శర్మ?
By: Tupaki Desk | 7 Nov 2015 9:30 AM GMTఈయన్ని చూడగానే ఎక్కడో చూసినట్టుందే. ఎప్పుడు చూసినా మొహం ముడుచుకున్నట్టే ఉంటుంది. చూడగానే విలనా ఏంటి? అనిపిస్తుంది. నవ్వగానే వెకిలిగా ఉందేంటి అనిపిస్తుంది. భృకుటి ముడి వేస్తూ .. కనుబొమలు - కనుగుడ్లు గిరగిరా తిప్పేసే స్టయిల్ కొత్తగా ఉందే అనిపిస్తుంది. అసలింతకీ ఈయన ఓ సపరేటు పీస్ గురూ అనాలనిపిస్తుంది. ఆయన పేరు మురళీ శర్మ.
మహేష్ హీరోగా నటించిన అతిధి ఈయన తొలిసినిమా. మొదటి ప్రయత్నమే నంది అవార్డు అందుకున్నాడు. విలనీకి యాప్ట్ అనిపించాడు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించాడు. అతిధి - కంత్రి - ఊసరవెల్లి - భలే భలే మగాడివోయ్.. సినిమాలతో టాలీవుడ్ లో బాగా పాపులర్ అయ్యాడు. ముంబై కుర్రాడే అయినా తెలుగులో తెలుగు మాట్లాడుతూ .. తెలుగు కుర్రాడిగానే సెటిలయ్యాడు. అటు హిందీలో నటిస్తూనే సౌత్ లో ఏ ఛాన్సుని వదిలిపెట్టడు.
భలే భలే మగాడివోయ్ చిత్రంలో ఓ వెరైటీ క్యారెక్టర్ తో ఆకట్టుకున్నాడు. కూతురికి పెళ్లి చేయాలనుకునే బాధ్యత గల తండ్రిగా బోలెడంత నటన చూపించాడు. అద్భుతమైన అభినయంతో సరిగ్గా సెట్టయిపోయాడే అనిపించేంతగా నటించాడు. మురళీ శర్మ అంటే ఇప్పుడు పూర్తిగా అందరికీ తెలిసిపోయాడు. టాలీవుడ్ లో ఓ గొప్ప నటుడు ఉన్నా ఎందుకు ఇంకా గుర్తించలేదు అన్న ప్రశ్న కూడా తలెత్తింది.
ఎనీ వే ఆల్ ది బెస్ట్ టు మురళీ. మునుముందు మరిన్ని మంచి సినిమాల్లో ఇలాగే మంచి పేరు తెచ్చుకునే పాత్రలు చేయాలని కోరుకుంటూ తుపాకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతోంది.