Begin typing your search above and press return to search.
200 రూపాయలతో మొదలైన మురళీమోహన్ లైఫ్!
By: Tupaki Desk | 17 April 2022 1:30 PM GMTనటుడిగాను .. నిర్మాతగాను .. బిజినెస్ మేన్ గాను మురళీమోహన్ సక్సెస్. ఆయన ఎంచుకున్న మార్గమేదైనా ఆయన అంతగా సక్సెస్ కావడానికి కారణం కృషి .. పట్టుదల .. క్రమశిక్షణ అని చెప్పచ్చు. ఇంటర్ తరువాత విజయవాడలో ఓ చిన్నపాటి షాప్ పెట్టేసి ఆయన తన జీవితాన్ని ప్రారంభించారు. వివాహమైన తరువాత ఆయన తన బిజినెస్ పైనే పూర్తి దృష్టి పెట్టారు. ఆ సమయంలోనే ఆయనకి సినిమాల్లో ఛాన్స్ రావడం జరిగింది. సినిమాల్లో సక్సెస్ అయితే అటు వెళదాం .. లేదంటే బిజినెస్ లోనే కొనసాగుదాం అని ఆయన అనుకున్నారు.
మురళీమోహన్ ఆ నిర్ణయం తీసుకోడం వెనుక ఆయన శ్రీమతి ప్రోత్సాహం కూడా ఉంది. ఇక సినిమాల్లోకి రావడానికి ముందు ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా తాను శోభన్ బాబుగారిని కలుసుకున్నాననీ, తనని సినిమాల్లోకి రమ్మని ఆయన కూడా అనడంతో తనపై తనకి ఒక నమ్మకం ఏర్పడిందని మురళీ మోహన్ చెప్పారు. ఇక సినిమాల్లోకి వచ్చిన తరువాత దాసరి గారు తనకి అండగా నిలిచి వరుస అవకాశాలు ఇస్తూ వెళ్లారనీ, నటుడిగా ఈ రోజున తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఆయనేనని అన్నారు.
హీరోగా .. కేరక్టర్ ఆర్టిస్టుగా చాలా దూరం ప్రయాణించిన మురళీ మోహన్, సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకుని నిర్మించిన చాలా సినిమాలు హిట్ అయ్యాయి. ఇక రియల్ ఎస్టేట్ పరంగా కూడా ఆయన తాను అనుకున్న లక్ష్యానికి చేరుకున్నారు. ఈ రోజున మురళీమోహన్ ఎంత శ్రీమంతుడనే విషయాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. అయినా మురళీమోహన్ దంపతులు చాలా సింపుల్ ఉంటారని వారి కోడలు రూప మాగంటి చెప్పారు. ఆమె మాట్లాడుతూ .."మా మామయ్యగారు ఇప్పటికీ ఖరీదైన బట్టలు కొనడానికి ఇష్టపడరు. అలాగే అత్తయ్య ఆభరణాల పట్ల ఆసక్తిని చూపరు.
అప్పుడప్పుడు మా అత్తగారు చెబుతూ ఉంటారు. విజయవాడలో మమ్మయ్యగారు మోటార్ల షాపు నడిపేవారు. 200 రూపాయలతో వాళ్ల లైఫ్ ను స్టార్ట్ చేశారట. వారానికి ఒకసారి సినిమాకి వెళ్లేవారట. ఎక్కడికైనా సైకిల్ పైనే వెళ్లి వచ్చేవారట. అయినా ఆ రోజులే చాలా ఆనందంగా ఉండేవని అంటూ ఉంటారు. ఇప్పటికీ ఇంట్లో అన్ని పనులు ఆమెనే చేస్తారు. ఒకసారి మా అత్తయ్య ఏదో పనిచేస్తూ ఉండగా ఎవరో వచ్చారు. 'అమ్మగారిని పిలువమ్మా' అని ఆమెతోనే అన్నారు. నేనే అమ్మగారిని అని అత్తయ్య అనడంతో వాళ్లు షాక్. అంత సింపుల్ గా కనిపిస్తారామె" అంటూ చెప్పుకొచ్చారు.