Begin typing your search above and press return to search.
మహేష్ తో అది కాదు, ఇది వేరే
By: Tupaki Desk | 9 Jan 2016 3:56 AM GMTమహేష్ బాబు ప్రస్తుతం బ్రహ్మోత్సవం చిత్రాన్ని చాలా ప్లాన్డ్ గా కంప్లీట్ చేసేస్తున్నాడు. సమ్మర్ టార్గెట్ ని అందుకని.. వెంటనే నెక్ట్స్ ప్రాజెక్ట్ మీదకు వెళ్లిపోవాలన్నది సూపర్ స్టార్ ఐడియా. ఇప్పటికే మహేష్ కోసం మురుగదాస్ పవర్ ఫుల్ స్క్రీన్ ప్లే కూడా ఫైనల్ చేసేస్తున్నాడు.
ఇలాంటి సమయంలో మహేష్ కు మురగదాస్ వినిపించిన స్టోరీపై ఓ వార్త గుప్పుమంది. తమిళ సూపర్ స్టార్ అజిత్ కు ఓ స్టోరీ చెప్పగా.. దాన్ని ఆయన రిజెక్ట్ చేశాడు. అదే స్టోరీని ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ కు వినిపించాడని అంటున్నారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ కొంత నిరుత్సాహపడ్డారు. అయితే... ఇవన్నీ రూమర్స్ అని కొట్టిపడేశాడు మురుగదాస్. మహేష్ బాబు కోసం కొత్త స్క్రిప్ట్ రాసుకున్నానని, ఎవరి ఇమేజ్ కి వీలుగా వారికి స్టోరీస్ సిద్ధం చేసుకుంటానని చెప్పాడు మురుగ. ఈ వివరణతో... ప్రిన్స్ ఫ్యాన్స్ లో సంతోషం కనిపిస్తోంది. డిఫరెంట్ మూవీస్ చేసే మహేష్ బాబు.. ఇతర హీరో రిజెక్ట్ చేసిన స్టోరీని యాక్సెప్ట్ చేసే సమస్యే లేదని చెప్పుకుంటున్నారు.
మురుగదాస్ తో మహేష్ చేయనున్న సినిమా.. ముంబై నేపథ్యంలో సాగనుంది. అందుకే మెజారిటీ భాగం అక్కడే షూటింగ్ తీయనున్నారు. ఈ చిత్రం కోసం వంద కోట్ల బడ్జెట్ కేటాయించారని సమాచారం. మురుగదాస్ కు డైరెక్టర్ గా దేశవ్యాప్తంగా క్రేజ్ ఉండడంతో.. తన మార్కెట్ ని విస్తరించుకోవడానికే.. చాలా కాలం తర్వాత, మహేష్ ఓ తమిళ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చాడంటున్నారు. అయితే.. శ్రీమంతుడు మూవీతో వంద కోట్ల వసూళ్లకు దగ్గరకొచ్చిన మహేష్.. ఈ సారి ఆ మార్క్ ని కూడా దాటడం ఖాయంగా కనిపిస్తోంది.