Begin typing your search above and press return to search.

మహేష్ ను అమీర్ తో పోల్చిన మురుగ

By:  Tupaki Desk   |   10 Sep 2017 6:06 AM GMT
మహేష్ ను అమీర్ తో పోల్చిన మురుగ
X
మహేష్ బాబు ఈజ్ ఈక్వల్ టు అమీర్ ఖాన్ అంటున్నాడు మురుగ. డెడికేషన్ విషయంలో ఇద్దరూ ఇద్దరే అని మురుగదాస్ అన్నాడు. తాను అమీర్ ఖాన్ తో ‘గజిని’ సినిమా చేస్తున్నపుడు.. అమీర్ చాలా ఓపిగ్గా ఉన్నాడని.. ఇంకా డేట్లు అవసరమైతే తీసుకోండి అని అడిగాడని... అమీర్ తర్వాత అలా తనను అడిగింది మహేష్ మాత్రమే అని మురుగదాస్ అన్నాడు.

‘స్పైడర్’ బ్లాక్ బస్టర్ హిట్ కాబోతోందని.. ఆ క్రెడిట్ మొత్తం మహేష్ బాబుకే చెందుతుందని మురుగ అన్నాడు. ‘స్పైడర్’ లాంటి సినిమా తాను చేయగలిగానంటే అందుకు కారణం మహేష్ మాత్రమే అని.. ద్విభాషా చిత్రం చేయడం కన్నా డబ్బింగ్ చేయడం మేలని.. ప్రతి సన్నివేశాన్ని రెండు సార్లు తీయడం.. బాగా రాకపోతే మళ్లీ మళ్లీ చేయడం అంత సులువు కాదని.. ఇలా మహేష్ ను ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా ఒక్కసారి కూడా అతను విసుక్కోలేదని.. ఓపిగ్గా సినిమా చేశాడని అన్నాడు.

‘స్పైడర్’ కోసం ఏకంగా 80 రోజుల పాటు నైట్ షూట్స్ చేసినా మహేష్ ఒక్క రోజూ అసహనం చెందలేదని మురుగ తెలిపాడు. ఈ సినిమా కోసం కొన్ని అద్బుతమైన యాక్షన్ ఎపిసోడ్లు చేశామని.. ఒక్కో యాక్షన్ ఎపిసోడ్లో 2 వేల మంది కనిపిస్తారని.. అవి చూస్తే పీటర్ హెయిన్ కష్టమేంటో అందరికీ తెలుస్తుందని మురుగదాస్ చెప్పాడు. ‘స్పైడర్’ ఇంటర్వెల్ సీన్లో బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోతుందని.. దాని గురించి అందరూ మాట్లాడుకుంటారని చెప్పాడు మురుగ.