Begin typing your search above and press return to search.

మహేష్‌ దిగాడు.. ఈ నెలంతా కానిస్తాడు

By:  Tupaki Desk   |   3 May 2017 9:50 AM GMT
మహేష్‌ దిగాడు.. ఈ నెలంతా కానిస్తాడు
X
అసలు జూన్ 23 సంగతి పక్కనెట్టేస్తే.. అనుకున్నట్లు ఆగస్టులోనైనా ఈ 'స్పైడర్' రిలీజవుతుందా అంటూ ఇన్నాళ్ళూ అనేక సందేహాలు వచ్చాయి. ఎందుకంటే చాలా రోజుల నుండి మహేష్‌ బాబు కూడా తన ఫ్యామిలీతో కలసి సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడే కాని.. షూటింగ్ కు మాత్రం రావట్లేదు. ఒక ప్రక్కన సినిమా రిలీజ్ లేటవ్వడం అనేది విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా అని తెలుస్తున్నా.. మరో ప్రక్కన మాత్రం ఇంకా 30% షూటింగ్ పెండింగ్ ఉందనే చెబుతున్నారు.

ఇలా పలురకాలుగా ఆలోచిస్తూ అభిమానులు ఆందోళన చెందుతున్న వేళ.. ఇప్పుడు ఎట్టకేలకు మహేష్‌ బాబు మళ్లీ షూటింగుకు వచ్చేశాడు. ఈరోజు నుండి ఏ.ఆర్.మురుగుదాస్ డైరక్షన్లో షూటింగులో పాల్గోనున్న మహేష్‌.. దాదాపు ఈ నెల 28వ తారీఖు వరకు షూటింగులోనే ఉంటాడట. ఈ నెలలో దాదాపు షూటింగ్ మొత్తం కానిచ్చేస్తాడి అంటున్నారు సన్నిహితులు. మరి మే నెలాఖరుకు షూటింగ్ పూర్తయిపోతే.. 2 నెలలపాటు వి.ఎఫ్.ఎక్స్ మరియు ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుని.. మరి ఆగస్టు మొదటి వారానికి సినిమాను తెచ్చేస్తారేమో. సో మహేష్‌ ఫ్యాన్స్ డోంట్ వర్రీ!!

ఇకపోతే ఆల్రెడీ స్పైడర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినప్పటికీ.. ఇప్పటివరకు టీజర్ మాత్రం ఇంకా రిలీజ్ చేయలేదు. మరి ఈ లుక్కుతో పాటు అది కూడా ఇచ్చేసుంటే బజ్ ఇంకా బాగుండేదేమో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/