Begin typing your search above and press return to search.
మహేష్ లా మరో నటుడు చెయ్యలేడు
By: Tupaki Desk | 22 Aug 2017 5:08 PM GMTఈ ఏడాది సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ‘స్పైడర్’ ఒకటి. మహేష్ బాబు-మెురుగదాస్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఇటు తెలుగు.. అటు తమిళ ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆ సినిమా విడుదలకు అటు ఇటుగా ఇంకో నెల రోజులే సమయం ఉంది. దాదాపు ఏడాదిగా ఈ సినిమా కోసం కష్టపడుతున్న మురుగదాస్.. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇక సినిమా ప్రమోషన్ మొదలుపెట్టాల్సిన సమయం వచ్చేసిన నేపథ్యంలో మురుగదాస్ మీడియాకు ‘స్పైడర్’ ముచ్చట్లు చెప్పడం ఆరంభించాడు. ఓ ఇంటర్వ్యూలో మురుగదాస్ ఈ సినిమా ఎలా మొదలైంది.. మహేష్ ఎలా చేశాడు.. ఇలాంటి ఆసక్తికర విశేషాలు చెప్పాడు. ఆయనేమన్నాడంటే..
‘‘చిరంజీవి గారితో ‘స్టాలిన్’ సినిమా చేస్తున్నపుడు రచయిత పరుచూరి వెంకటేశ్వర రావు గారు మహేష్ ను నాకు పరిచయం చేశారు. ఆ తర్వాత మహేష్ చేసిన ‘అతడు’ సినిమా చూశాను. అందులో మహేష్ ఆల్ రౌండ్ పెర్ఫార్మెన్స్ చూశాక తనతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నా. మహేష్ తో కూడా ఆ విషయం చెప్పాను. కానీ ఇద్దరం బిజీగా ఉండటం వల్ల మా కాంబినేషన్లో సినిమా రావడానికి పదేళ్లు పట్టింది. ‘స్పైడర్’ పాత్రను మహేష్ అద్భుతంగా చేశాడు. అతను డైరెక్టర్స్ హీరో. మహేష్ చేసినట్టు స్పైడర్ పాత్రను ఇండియాలో మరో నటుడు చేయలేడు. ఈ సినిమా తర్వాత నేను కూడా ఆయనకు అభిమానిని అయిపోయా.
మేం 80 రోజులపాటు రాత్రి పూట షూట్ చేశాం. ఒక్కరోజు కూడా ఏ కంప్లైంట్ చేయలేదు మహేష్. కరెక్ట్ టైంకి వచ్చి అంకితభావంతో పని చేశఆడు. ఒక స్పై థ్రిల్లర్ తీయాలని అనుకున్నప్పుడు నాకు ముందుగా గుర్తొచ్చింది మహేషే. ఆ పాత్రకి తగిన మాస్ ఫాలోయింగ్.. లుక్స్ అతడికున్నాయి. అలాగే రెండు భాషలకూ అతను సరిపోయాడు. మహేష్ తమిళ డబ్బింగ్ కూడా అదరగొట్టాడు. ఔట్ పుట్ చూసి ఆశ్చర్యపోయాను. ఈ సినిమా తరవాత మహేష్ తమిళంలో పెద్ద స్టార్ అవుతాడు. ఈ సినిమా కథ మొత్తం హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. తమిళంలో కూడా అంతే’’ అని చెప్పాడు మురుగదాస్.