Begin typing your search above and press return to search.

మహేష్ అంత హ్యాండ్సమ్ గా ఉంటుంది

By:  Tupaki Desk   |   16 Sep 2017 4:00 AM GMT
మహేష్ అంత హ్యాండ్సమ్ గా ఉంటుంది
X
‘‘స్పైడర్ ఎలా వచ్చిందని నన్ను చాలామంది ఫ్యాన్స్ అడిగారు. నేను చెప్పిన సమాధానం ఒకటే మహేష్ బాబు ఎలా ఉంటాడు. స్టయిల్ గా.. హ్యాండ్సమ్ గా.. డెడికేటివ్ గా.. కచ్చితంగా అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అంటూ మురుగ దాస్ ప్రిన్స్ అభిమానులను మాటల్తో మురిపించేశాడు. స్పైడర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడిన డైరెక్టర్ మురుగదాస్ బోలెడు విశేషాలు అభిమానులతో పంచుకున్నాడు.

‘‘చాలా ఏళ్ల క్రితం విజయవాడలో ఒక్కడు సినిమా చూశా. అది మూడోవారం. థియేటర్ హౌస్ ఫుల్ అయిపోయింది. ఫైట్స్... పాటలు వచ్చినప్పుడు ఓ పండగ వాతావరణం కనిపించింది. అప్పుడే ఆయనకు ఫ్యాన్ అయిపోయా. తర్వాత మహేష్ బాబు ను కలిసి కలిసి మీతో సినిమా తీయాలని ఉందని చెప్పా. ఇన్నాళ్లకు కుదిరింది. ఇది నా లైఫ్ లో మరిచిపోలేని రోజు’’

- తన పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ మురుగదాస్ చెప్పిన మాటలివి.

‘‘నేను చాలామంది హీరోలతో కలిసి పనిచేశా. కానీ మహేష్ లాంటి హీరోను చూడలేదు. తను లేకుండా ఈ సినిమా ఇంపాజిబుల్. ఏడాది కాలంలో ఆరు నెలలపాటు రాత్రుళ్లే షూటింగ్ చేశాను. కానీ ఏ ఒక్కరోజు కూడా రేపు ఆలస్యంగా వస్తానని అనలేదు. ఈ రోజు పెందలాడే వెళ్లిపోతానని అనలేదు. ఒక సినిమా హిట్ అయిందీ అంటే మామూలు విషయం కాదు. డైరెక్టర్ హీరో ఎంతో స్ట్రెంగ్త్ గా ఉంటేనే కుదురుతుంది. స్పైడర్ సినిమా హిట్ ను మహేష్ బాబుకే అంకితం ఇస్తాను. ఆయనను అందరూ ప్రిన్స్ అంటారు. కానీ అందరినీ సమానంగా ట్రీట్ చేయగలడం ఆయన గొప్పతనం’’ అంటూ మురుగదాస్ ప్రిన్స్ కమిట్ మెంట్ కు హ్యాట్సాఫ్ చెప్పాడు.

‘‘ఈ సినిమా కోసం ప్రొడ్యూసర్స్ మధు అండ్ ప్రసాద్ డబ్బు పెట్టుబడి పెట్టడంతో సరిపోయిందనుకోలేదు. అసిస్టెంట్ డైరెక్టర్ లాగా కావాల్సిన ప్రతి విషయంలోనూ సపోర్ట్ అందించారు. ఈ సినిమా స్పెషల్ లైటింగ్ అండ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. మీరంతా ఓ కొత్త మహేష్ బాబును చూస్తారు. ఆ ఘనత సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ ది. హ్యారిస్ జైరాజ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే లిటరల్ గా అదిరింది అని చెప్పాలి. స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ ఇంటర్నేషనల్ స్టాండర్స్డ్ తో డిజైన్ చేశారు. ఈ సినిమా కోసం నా అసిస్టెంట్ డైరెక్టర్లు ఏడుగురు పగలు రాత్రి తేడా లేకుండా పని చేశారు’’ అంటూ మురుగదాస్ వాళ్లందరికీ థ్యాంక్స్ చెప్పాడు.