Begin typing your search above and press return to search.

ముర‌గ‌దాస్ సూప‌ర్ హీరోపై ప‌డ్డాడా?

By:  Tupaki Desk   |   24 Nov 2022 11:30 PM GMT
ముర‌గ‌దాస్ సూప‌ర్ హీరోపై ప‌డ్డాడా?
X
'మానాడు' విజ‌యంతో శింబు మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ లో ప‌డ్డాడు. కొన్నాళ్ల పాటు వ‌రుస ప‌ర‌జ‌యాల్లో ఉన్న శింబుకి 'మానాడు 'విజ‌యం ఊర‌ట‌నిచ్చింది. ప్రస్తుతం 'ప‌తు త‌లా' అనే ఓ చిత్రంలో న‌టిస్తున్నాడు. షూటింగ్ స‌హా అన్నిప‌నులు పూర్తిచేసి వ‌చ్చే ఏడాది రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. మ‌రోవైపు శింబు-స్టార్ మేక‌ర్ ముర‌గ‌దాస్ కాంబినేష‌న్ లో ఓ సినిమా తెర‌కెక్కుతుం ద‌ని చాలా కాలంగా ప్ర‌చారం సాగుతోంది.

ఇద్ద‌రి మ‌ధ్య క‌థా చ‌ర్చ‌లు ముగిసాయని సెట్స్ కి వెళ్ల‌డ‌మే ఆల‌స్య‌మ‌ని ప్ర‌చారం సాగింది. అలాగే లేడీ ద‌ర్శ‌కురాలు సుధ కొంగ‌ర తోనూ శింబు ఓ సినిమా చేస్తున్న‌ట్లు అంతే జోరుగా ప్ర‌చారం సాగుతోంది.

తాజా స‌మాచారం ప్ర‌కారం ముర‌గ‌దాస్ ప్రాజెక్ట్ లాక్ అయిన‌ట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి స్టోరీ లైన్ సైతం లీకైంది. శింబు కోసం ముర‌గాస్ ఏకంగా సూప‌ర్ హీరో క‌థ‌నే సిద్దం చేసారుట‌.

శింబు ని సూప‌ర్ హీరోగా మ‌లుస్తూనే..త‌న‌దైన మార్క్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఆవిష్క‌రిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇక ముర‌గ‌దాస్ స‌క్సెస్ అందుకుని నాలుగేళ్లు అవుతుంది.. 2018లో విజ‌య్ హీరోగా స‌ర్కార్ తెర‌కెక్కించి హిట్ అందుకున్నారు. ఆ త‌ర్వాత సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ కాంత్ తో తెర‌కెక్కించిన 'ద‌ర్బార్' భారీ అంచ‌నాల‌తో రిలీజ్ అయినా వాటిని అందుకోవ‌డం లో విఫ‌ల‌మైంది.

ఆ త‌ర్వాత కోవిడ్ స‌హా స‌రైన క‌థ కుద‌ర‌క పోవ‌డంతో స్టార్ మేక‌ర్ ఖాళీగానే ఉన్నారు. మళ్లీ రెండేళ్ల గ్యాప్ అనంత‌రం శింబుతో ముందుకెళ్తున్న‌ట్లు తెలుస్తోంది. వ‌చ్చే ఏడాది ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్తున్న‌ట్లు తెలిసింది.

మానాడు స‌క్సెస్ తో శింబుకి అవ‌కాశాలు క్యూ క‌ట్టిన‌ట్లు తెలుస్తోంది. అయితే క‌థ‌ల ఎంపిక‌లో గ‌తంలో చేసిన త‌ప్పుల్ని ఈసారి పున‌రావృతం కాకుండా జాగ్ర‌త్త ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. మంచి క‌థ‌లు..స్టార్ మేక‌ర్స్ తోనే సినిమాలు చేయాల‌ని..సొంత ప్ర‌యోగాల‌కు పోకూడ‌దు అన్న‌విష‌యం పైనా సీరియ‌స్ గానే ఆలోచ‌న చేస్తున్న‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.