Begin typing your search above and press return to search.
మురుగదాస్ వెయిటింగ్.. విశాల్ రేంజ్ అది
By: Tupaki Desk | 5 Feb 2019 11:50 AM GMTతమిళ దర్శకుడు మురుగదాస్ రేంజ్ ఏంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. రమణ.. గజిని.. తుపాకి.. కత్తి లాంటి బ్లాక్ బస్టర్లు అందించిన ఘనుడతను. మణిరత్నం - శంకర్ లాంటి దర్శకుల తర్వాత తమిళంలో అంతటి ఇమేజ్ సంపాదించిన డైరెక్టర్ అతను. ఈ మధ్య స్పైడర్.. సర్కార్ సినిమాలతో కొంత నిరాశ పరిచినప్పటికీ.. ఇప్పటికీ మురుగదాస్ క్రేజ్ మామూలుగా లేదు. ఇప్పుడతను సూపర్ స్టార్ రజనీకాంత్ తో సినిమా చేయబోతున్నాడు. ఆ స్థాయి దర్శకుడు.. తన కొత్త సినిమా *అయోగ్య*టీజర్ బుధవారం రిలీజ్ కాబోతోందని ట్విట్టర్లో విశాల్ మెసేజ్ పెడితే.. *వెయిటింగ్* అంటూ కామెంట్ చేయడం విశేషం.
విశాల్ తమిళంలో చిన్న చిన్న సినిమాలతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. కెరీర్లో చాలా ఏళ్లు మీడియం రేంజి హీరోగానే ఉన్నాడు. కానీ గత ఐదారేళ్లలో అతడి రేంజే మారిపోయింది. ఓవైపు వరుస హిట్లు - మరోవైపు నడిగర్ సంఘం కార్యదర్శిగా.. నిర్మాతల మండలి అధ్యక్షుడిగా అనేక మంచి పనులు చేసి తన ఇమేజ్ పెంచుకున్నాడు. అతడి డేరింగ్ అండ్ డాషింగ్ యాటిట్యూడ్ ఇండస్ట్రీలోనూ చాలామందిని అభిమానులుగా మార్చింది. ఇటీవల తనకు వ్యతిరేకంగా నిర్మాతలు కొందరు ఆందోళన చేపట్టినా విశాల్ తొణకలేదు. వాళ్లకు దీటుగా సమాధానం చెప్పాడు. తన చేతుల మీదుగా ఇళయరాజా 75 వసంతాల ఈవెంట్ నిర్వహించాడు.
దీంతో విశాల్ మరింత పవర్ ఫుల్ గా మారాడు. అందుకే అతడి కొత్త సినిమా టీజర్ రిలీజవుతోంటే.. ఇండస్ట్రీ అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. చాలామంది సెలబ్రెటీలు దీనిపై కామెంట్ చేస్తున్నారు. అందులో మురుగదాస్ కూడా ఒకడు. ఈ సినిమాతో తనకు ఏ రకమైన సంబంధం లేకపోయినా మురుగదాస్ ఇలాంటి కామెంట్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. విశాల్ రేంజ్ ఏంటో చెప్పడానికి ఇది ఉదాహరణ అంటున్నారు. ఇక *అయోగ్య* విషయానికి వస్తే ఇది తెలుగు హిట్ *టెంపర్*కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ హిందీలో *సింబా*గా రీమేక్ అయి పెద్ద విజయం సాధించిన ఈ చిత్రం తమిళంలోనూ కచ్చితంగా సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు.