Begin typing your search above and press return to search.
అసలు 'కత్తి' కథ చిరంజీవిదే??
By: Tupaki Desk | 11 Jan 2017 4:30 AM GMTతమిళ 'కత్తి' సినిమాను చూసి.. అది తెగ నచ్చేయడంతో తెలుగులో ''ఖైదీ నెం 150'' అంటూ మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆల్రెడీ రిలీజ్ హైప్ అండ్ క్రేజ్ తో ప్రకంపనాలు రేపుతోంది. అయితే ఈ సినిమా కథ ఇప్పటిది కాదట.. ఇది ఎప్పుడో తనకు మురుగుదాస్ చెప్పిన కథే అని సెలవిచ్చారు మెగాస్టార్.
అసలు స్టాలిన్ సినిమా చేసేటప్పుడు ఈ 'కత్తి' సినిమా కథను కూడా ఏ.ఆర్.మురుగుదాస్ చెప్పాడట. ఆ సమయంలో తమిళంలో విజయ్ తో తెలుగులో మీతో ఈ సినిమా చేస్తే బాగుంటుంది అని కూడా సూచించి.. చిరు కోసం వెయిట్ చేస్తా అన్నాడు కూడా. కాని కథ విన్న తరువాత.. ఓ రేండేళ్ళు ఆగి చేద్దాంలే అనుకున్న చిరు.. కట్ చేస్తే రెండేళ్ళలో సినిమాలే వదిలేశారు. దానితో ఈ కత్తిని మురుగుదాస్ తెలుగులో వేరే వారితో చేయడం ఇష్టం లేక కేవలం తమిళ వర్షన్ ఒక్కటే చేసుకుని సైలెంట్ అయిపోయాడు. ఈ విషయాలన్నీ స్వయంగా మెగాస్టార్ చిరంజీవి వివరించారు.
కాకపోతే ఈ సినిమాను తమిళంలో తీసిన తరువాత తెలుగులో చాలామంది హీరోల దగ్గరకు రీమేక్ కోసం తిరిగింది. చివరకు పవన్ కళ్యాణ్ అండ్ ఎన్టీఆర్ లు కూడా ఈ సినిమాను వద్దని రిజక్ట్ చేశారు. ఇప్పుడు చిరంజీవి ఈ సినిమాలో కాసినన్ని మార్పులు చేర్పులు చేసి వినాయక్ డైరక్షన్లో ఇలా మన ముందుకు తీసుకొచ్చేశారు. అది సంగతి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/