Begin typing your search above and press return to search.

జెర్సీ గురించి రజని స్టైల్ కౌంటర్

By:  Tupaki Desk   |   19 April 2019 9:20 AM GMT
జెర్సీ గురించి రజని స్టైల్ కౌంటర్
X
ఎట్టకేలకు నాని ఏడాది నిరీక్షణ తర్వాత తన స్థాయి సక్సెస్ అందుకున్నాడు. జెర్సీకి సర్వత్రా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ప్రవాహంలా ముంచెత్తుతోంది. వారు వీరు అని తేడా లేకుండా అందరూ ప్రశంశలు కురిపిస్తున్నారు.ఎమోషన్ ని సరైన రీతీలో ప్రెజెంట్ చేస్తే ఫలితం ఏ స్థాయిలో ఉంటుందో బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇదిలా ఉండగా దీనికి మ్యూజిక్ ఇచ్చిన అనిరుద్ రవిచందర్ మీద ముందు నుంచి మూవీ లవర్స్ కొంత అనుమానం వ్యక్తం చేస్తూ వచ్చారు.

ఆల్బమ్ డీసెంట్ గానే ఉన్నప్పటికీ మరీ గొప్పగా ఏమి లేదనే పెదవి విరుపులు వచ్చాయి. దానికి తోడు అనిరుద్ మొదటి సినిమా అజ్ఞాతవాసి టైంలో చాలా ట్రాలింగ్ జరిగింది. పవన్ లాంటి స్టార్ హీరో రేంజ్ మ్యూజిక్ ఇవ్వలేదని ఘాటుగా తిట్టిపోసిన వాళ్ళున్నారు. ముఖ్యంగా అందులో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కనీస స్థాయిలో లేదని నెగటివ్ ఫీడ్ బ్యాక్ చాలా వచ్చింది

ఇప్పుడు జెర్సీ వచ్చి లెక్కలు మొత్తం మార్చేసింది. గౌతం తిన్ననూరి టేకింగ్ నాని యాక్టింగ్ కు సమానంగా అనిరుద్ రవిచందర్ బిజిఎంకు క్లాప్స్ పడుతున్నాయి. ఫీల్ ని అద్భుతంగా క్యారీ చేస్తూ థీమ్ కు తగ్గ మ్యూజిక్ ఇచ్చాడని అందరు పొగడ్తలతో విష్ చేస్తున్నారు. దీన్ని పురస్కరించుకుని తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన అనిరుద్ పేటలోని రజని ఇంట్రో సీన్ లో వచ్చే నా పని అయిపోతుందనుకున్నారా" అని చెప్పే డైలాగ్ ని వీడియోతో సహా పెట్టేశాడు.

అంటే ఇది నా సత్తా అంటూ జెర్సీ వర్క్ గురించి చెప్పకనే చెప్పాడు. దీనికి బలం చేకూరేలా హరీష్ శంకర్ మారుతీ లాంటి దర్శకులు మొదటి షో అవ్వడం ఆలస్యం సినిమా గురించి స్పందిస్తూ టీం కు విషెస్ చెప్పారు. అందరికి సాధారణంగా ద్వితీయ విఘ్నం ఉంటుంది. కాని అనిరుద్ రవిచందర్ వెరైటీతో మొదటి సినిమాను విఘ్నంగా ఎదురుకుని రెండో సినిమాను దిగ్విజయాన్ని అందుకున్నాడు