Begin typing your search above and press return to search.
సౌత్ ఫ్యాన్స్ నమ్మకాన్ని కోల్పోతున్న ఆస్కార్ విజేత
By: Tupaki Desk | 18 Sep 2022 10:30 AM GMTప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును దక్కించుకున్న ఏఆర్ రహమాన్ గతంలో ట్యూన్ చేసిన వందల కొద్ది పాటలు అంటే ఇప్పటికి కూడా ఎంతో మంది చెవులు కోసుకుంటారు అనడంలో సందేహం లేదు. ప్రతి రోజు రహమాన్ స్వరపర్చిన కొన్నేళ్ల క్రితం పాటలు ఇప్పటికీ ఆ పాటలను శ్రోతలు వింటూనే ఉన్నారు. కానీ ఈ మధ్య కాలంలో రెహమాన్ నుండి వచ్చిన పాటలు ఏవీ కూడా రిపీట్ ప్లే కు నోచుకోవడం లేదు.
రెహమాన్ అభిమానులు స్వయంగా అంటున్న మాట. ఈయన ఈ మధ్య కాలంలో చేసిన ఏ ఒక్క మ్యూజిక్ ఆల్బం కూడా అద్భుతం అన్నట్లుగా సాగలేదు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆయన చేసిన ప్రతిష్టాత్మక సినిమా పొన్నియన్ సెల్వన్ ఆల్బం లోని పాటలు కూడా పెద్దగా శ్రోతల యొక్క చెవికి ఎక్కడం లేదు.
తాజాగా వచ్చిన సై పాట ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రహమాన్ స్థాయిలో లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు.. ఈ పాటను రహమాన్ ట్యూన్ చేశాడు అంటే నమ్మశక్యంగా లేదు అంటూ విమర్శలు చేస్తున్నారు. సై పాట ఒక్కటే కాదు ఆయన నుండి వచ్చిన పొన్నియన్ సెల్వన్ పాటలు అన్ని కూడా ఇదే పరిస్థితి.
పొన్నియన్ సెల్వన్ మాత్రమే కాకుండా సౌత్ లో ఈయన ఈ మధ్య కాలంలో స్వరపరచిన ప్రతి పాట యొక్క ఫలితం కూడా ఇలాగే ఉందంటూ విమర్శలు వస్తున్నాయి. ఒకప్పుడు రెహమాన్ పాటలు అంటే మినిమం ఉంటాయి అనే అభిప్రాయం ఉండేది. దేశ వ్యాప్తంగా ఒకప్పుడు ఉర్రూతలూగించిన పాటలను అందించిన రహమాన్ ఇప్పుడు మాత్రం సౌత్ ఆడియన్స్ యొక్క నమ్మకంను కోల్పోతున్నాడు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు ఇలాంటి ఆల్బంలనే ఆయన ఇస్తే కష్టం అన్నట్లుగా కొందరు పెదవి విరుస్తున్నారు.