Begin typing your search above and press return to search.

సాహో కన్నా ముందు రాక్షసుడి పరీక్ష

By:  Tupaki Desk   |   18 Jun 2019 5:47 AM GMT
సాహో కన్నా ముందు రాక్షసుడి పరీక్ష
X
రెండు వందల కోట్ల బడ్జెట్ తో ఆకాశమే హద్దుగా అంచనాలు మోస్తూ ఆగస్ట్ 15 రాబోతున్న సాహో గురించి ఎంత చెప్పుకున్నా ప్రభాస్ ఫ్యాన్స్ కు తనివి తీరడం లేదు. రికార్డుల ఊచకోత టీజర్ తోనే మొదలైపోయింది. దీని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం జిబ్రాన్ ను అఫీషియల్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇంత భారీ కాన్వాస్ ఉన్న మూవీకి అతను ఎంత వరకు న్యాయం చేయగలడు అనే దాని మీద కొంత సందేహం రావడం సహజం.

రన్ రాజా రన్ తప్ప జిబ్రాన్ కు తెలుగులో పెద్దగా సక్సెస్ లేదు. అదీ సుజిత్ సినిమానే. మరి ఇంత పెద్ద బరువును జిబ్రాన్ ఎలా మోస్తాడు అనే కోణంలో ఇప్పటికే విశ్లేషణలు మొదలైపోయాయి. అయితే వాటికి సమాధానంగా వచ్చే నెల విడుదల కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రాక్షసుడుని శాంపిల్ గా చూపించవచ్చు. కారణం దానికి జిబ్రానే మ్యూజిక్

ఇది ప్రత్యేకంగా చెప్పడానికి కారణం ఉంది. రాక్షసుడు ఒరిజినల్ వెర్షన్ రట్ససన్ సక్సెస్ కావడంలో జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా కీలక పాత్ర పోషించింది. అది చూసిన వాళ్లకు ఇది అవగాహన ఉంటుంది. సుమారు గంట పాటు ఉండే బీజీఎమ్ ని యూట్యూబ్ లో పెడితే 8 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి అంటే అర్థం చేసుకోవచ్చు జనానికి జిబ్రాన్ కంపోజింగ్ ఏ రేంజ్ లో రీచ్ అయ్యిందో.

ఇప్పుడు రాక్షసుడుకి అదే మేజిక్ రిపీట్ చేయడంలో ఎలాంటి సందేహం లేదు. సో సాహోకు జిబ్రాన్ ఎంతవరకు న్యాయం చేకూరుస్తాడు అనే దాని గురించి టెన్షన్ పడుతున్న వాళ్లకు రాక్షసుడు ఓ మంచి ఆన్సర్ గా మిగిలే అవకాశం ఉంది. ఎలాగూ సాహూ టీజర్ లో మెప్పించాడు కాబట్టి ఫైనల్ అవుట్ ఫుట్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు