Begin typing your search above and press return to search.

మజిలీ వివాదం.. అలా జరిగిందట!

By:  Tupaki Desk   |   19 April 2019 7:07 AM GMT
మజిలీ వివాదం.. అలా జరిగిందట!
X
సమ్మర్ సీజన్ లో మొదటగా రిలీజ్ అయిన చిత్రం 'మజిలీ'. ఏప్రిల్ 5 న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా సక్సెస్ మేకర్స్ కు సంతోషాన్ని ఇచ్చింది కానీ ఈ సినిమా రిలీజ్ ముందు మాత్రం అసలు సమయానికి రిలీజ్ అవుతుందా లేదా అని టెన్షన్ పడ్డారు. ముందుగా అనుకున్న సమయానికి మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ వర్క్ పూర్తిచేయకపోవడంతో నిర్మాతలు థమన్ చేత బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయించాల్సి వచ్చింది.

సినిమా రిలీజ్ కు ముందు వివాదం.. నెగెటివిటీ ఎందుకునని ఊరుకున్నారు కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం గోపి సుందర్ పై ఫిలిం ఛాంబర్ లో కంప్లయింట్ చేసేందుకు రెడీ అయ్యారు. సినిమాకు మొత్త రెమ్యూనరేషన్ ముందే తీసుకుని వర్క్ కంప్లీట్ చేసే విషయం ఇబ్బంది పెట్టాడని.. దీంతో థమన్ కు మళ్ళీ రెమ్యూనరేషన్ ఇచ్చి నేపథ్య సంగీతం చేయించుకోవాల్సి వచ్చిందని.. అందువల్ల తమకు నష్టం జరిగిందనేది వారి వాదన. ఛాంబర్ కు ఫిర్యాదు చేసే విషయం తెలిసిన గోపి సుందర్ నిర్మాతలతో రాజీకొచ్చాడని సమాచారం. తను తీసుకున్న రెమ్యూనరేషన్ లో కొంత భాగం నిర్మాతలకు తిరిగి ఇచ్చేందుకు రెడీ అయ్యాడట. దీంతో కంప్లయింట్ చేసే ప్రయత్నాన్ని నిర్మాతలు విరమించుకున్నారని అంటున్నారు.

సౌత్ లో ఇప్పుడున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో గోపి సుందర్ ఒకరు. 'గీత గోవిందం' లాంటి చార్ట్ బస్టర్ ఆల్బమ్ లు డెలివర్ చేస్తుండడంతో ఆయనకు టాలీవుడ్లో మంచి డిమాండ్ ఉంది. అయితే గోపి సుందర్ వర్క్ విషయమంలో డిలే చేస్తాడనే టాక్ ఉంది. ఇలా వివాదంలో చిక్కుకోవడం మాత్రం మొదటిసారి. ఏదైతేనేం.. 'మజిలీ' హిట్ అయింది. ఈ వివాదం కూడా సామరస్యంగా పరిష్కారం అయింది. అల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్!