Begin typing your search above and press return to search.

గుట్టుగా మ్యూజిక్ డైరెక్ట‌ర్ పెళ్లి!

By:  Tupaki Desk   |   12 May 2018 6:51 AM GMT
గుట్టుగా మ్యూజిక్ డైరెక్ట‌ర్ పెళ్లి!
X
ఎవ‌రిని పెళ్లి చేసుకుంటామ‌న్న‌ది అంద‌రికి చెప్పే చేసుకుంటా. దాచుకోవ‌టానికి ఏముంది? పెళ్లి చేసుకోవ‌టం మంచి ప‌నేగా? అంటూ చాలానే మాట‌లు చెబుతుంటారు సినీప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖులు. అయితే.. ఇటీవ‌ల కాలంలో గుట్టు చ‌ప్పుడు కాకుండా పెళ్లి చేసుకోవ‌టం ఎక్కువైంది.

మొన్నీమ‌ధ్య‌నే పెళ్లి కూతురు అయిపోయిన బాలీవుడ్ హాట్ స్టార్ నేహాధూపియా పెళ్లి చేసుకొని.. పెళ్లి ఫోటోల్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన త‌ర్వాత మాత్ర‌మే ఆమె పెళ్లి ముచ్చ‌ట బ‌య‌ట‌కు వ‌చ్చింది. తాజాగా అలాంటి పెళ్లే మ‌రొక‌టి చోటు చేసుకుంది. ఇటీవ‌ల కాలంలో ర‌హ‌స్యంగా పెళ్లి చేసుకోవ‌టం బాలీవుడ్ సెల‌బ్రిటీల్లో ఎక్కువ అవుతోంది.

సంగీత ద‌ర్శ‌కుడిగా గుర్తింపు తెచ్చుకోవ‌ట‌మే కాదు న‌టుడిగా ప‌లు సినిమాల్లో యాక్ట్ చేసిన హిమేష్ రేష్మియా పెళ్లి పీట‌ల మీద‌కు ఎక్కేశాడు. గ‌తంలో పెళ్లి అయిన హిమేష్.. ఈ మ‌ధ్య‌నే విడాకులు ఇచ్చేశారు. తాజాగా ఆయ‌న టీవీ న‌టి సోనియా క‌పూర్ ను పెళ్లాడారు. శుక్ర‌వారం రాత్రి త‌న‌కు బాగా స‌న్నిహిత‌మైన స్నేహితులు.. కుటుంబ స‌భ్యుల మ‌ధ్య‌న పెళ్లి చేసుకున్న‌ట్లుగా తెలుస్తోంది.తాజాగా తాజా పెళ్లి ఫోటో సోష‌ల్ మీడియాలో ద‌ర్శ‌న‌మిస్తోంది.