Begin typing your search above and press return to search.

హిందూ దేవుడి పాట కంపోజ్ చేయనన్నాడా ?

By:  Tupaki Desk   |   28 Aug 2019 8:32 AM GMT
హిందూ దేవుడి పాట కంపోజ్ చేయనన్నాడా ?
X
ఎక్కడైనా దేశాలకు కులమతాలకు సరిహద్దులు ఉంటాయి కాని కళ ఎప్పుడు వాటికి అతీతంగా ఉంటుంది. అందుకే మహదేవన్ మహమ్మద్ రఫీ నుంచి మణిశర్మ మిక్కి జే మేయర్ దాకా ఎందరో గాయకులు మ్యూజిక్ డైరెక్టర్లు గొప్ప పేరు తెచ్చుకున్నారు. కులంతో సంబంధం లేకుండా ఎందరో ఇతర దేవుళ్ళ పాటలు కంపోజ్ చేయడం పాడటం గతంలో ఎన్నోసార్లు జరిగింది. కాని గీత రచయిత అనంత శ్రీరామ్ మాత్రం ప్రతి చోటా ఆ పరిస్థితి లేదంటూ ఓ ఉదహరణ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కమెడియన్ ఆలి నిర్వహించే ఓ టాక్ షోలో అనంత శ్రీరామ్ మాట్లాడుతూ గతంలో ఓ సంగీత దర్శకుడు తాను రాసిన సాహిత్యంలో ఓ హిందు దేవుడి పేరు ఉన్నందుకు ట్యూన్ కంపోజ్ చేయడానికి తిరస్కరించాడని అప్పుడు చాలా బాధ కలిగిందని పాటకు కులానికి ముడిపెడుతున్న తీరు చూసి అతని పట్ల ఏహ్యభావం కలిగిందని చెప్పాడు. కాని ఆలి ఎంత అడిగినా ఆ పేరు మాత్రం చెప్పలేదు. బయటపెడితే అనవసరమైన అపార్థాలతో పాటు పబ్లిక్ అతని ఇమేజ్ దెబ్బతినడంతో పాటు కెరీర్ ప్రమాదంలో పడుతుందని గౌరవంగా తప్పుకున్నాడు.

ఇలాంటివి సోషల్ మీడియాలో సింపుల్ చూసి వదిలేయరు కాబట్టి సదరు సంగీత దర్శకుడు ఎవరా అనే ఊహాగానాలు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. అనంత శ్రీరామ్ చెప్పిన ప్రకారం చూస్తే ఇలా కళకు కులానికి లింక్ పెట్టడం సమర్ధనీయం కాదు. ఇప్పుడు దీని మీద ఆ మ్యూజిక్ డైరెక్టర్ పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పేరు తెలియకపోయినా అనంత శ్రీరామ్ వెర్షన్ లో తప్పు బయపడింది కాబట్టి పోస్టుల రూపంలో సదరు సంగీత దర్శకుడి మీద విరుచుకుపడుతున్నారు.