Begin typing your search above and press return to search.
పిల్లల బాల్యాన్ని చిదిమేయొద్దు!- తమన్
By: Tupaki Desk | 13 April 2019 5:56 AM GMTకాంపిటీషన్ పేరుతో పిల్లలపై అనవసరమైన ఒత్తిడి పెంచొద్దని.. అలా చేస్తే వాళ్లు బాల్యంలో ఎంతో కోల్పోతున్నారని పేరెంట్ కి సూచించారు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. నేటి తరం పిల్లలపై పుస్తకాలు, స్టడీస్ బర్డెన్ తో పాటు రకరకాల కాంపిటీషన్స్ పేరుతో అనవసరమైన మానసిక ఒత్తిళ్లకు కారణమవుతున్న సంగతి తెలిసిందే. అలాంటి వాళ్లకు తమన్ చక్కని మాటనే చెప్పారు. స్టార్ మా సూపర్ సింగర్స్ సింగింగ్ కాంపిటీషన్ కి జడ్జిగా కొనసాగుతున్న తమన్ తన స్వీయానుభవంతో ఈ మాట చెప్పారు.
``మా టైమ్ లో ఇన్ని కాంటెస్ట్ లు లేవు. ఇప్పుడు పిల్లలు సీరియస్ పోటీల్లో పాల్గొనడం చూస్తుంటే కొంచెం బాధనిపిస్తోంది. బాల్యాన్ని ఎంజాయ్ చేయనీయకుండా చిన్నప్ప్పుడే గ్లామర్ .. ఎక్స్‌పోజర్ అంటూ క్రేజ్ పెంచేస్తే వాళ్లు చాలా మిస్ అవుతారు. చిన్నతనంలో ఆడుకోవాలి.. చదువుకోవాలి. అందుకే పిల్లల పోటీలను జడ్జ్ చేయాలంటే ఇష్టపడను`` అని తమన్ వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు నేను జడ్జ్ చేస్తున్న కాంటెస్ట్ లో పోటీదారులంతా పరిణతి చెందిన పిల్లలే. తగిన వయసు వాళ్లకు ఉందని అన్నారు. 15 వయసప్పుడే బాలు టీవీ ప్రోగ్రామ్ కి ఆర్కెస్ట్రా బృందంలో డ్రమ్స్ వాయించానని గుర్తు చేసుకున్నారు. స్టార్ మా బిగ్ బాస్ రియాలిటీ షోకి థీమ్ సాంగ్ ఇచ్చిన అనుభవంతోనే ప్రస్తుతం కిడ్స్ రియాలిటీ షోలకు పని చేస్తున్నాని వెల్లడించారు.
స్టార్ మా సూపర్ సింగర్ మ్యూజికల్ రియాల్టీ షో రాత్రి 9 గం.లకు ప్రసారం అవుతోంది. ఈ కార్యక్రమానికి సింగర్స్ హరితేజ, రేవంత్ తో కలిసి న్యాయనిర్ణేతగా పని చేస్తున్నారు తమన్. పరిణతి లేని గాయనీగాయకుల కోసం రూపొందించిన కార్యక్రమమిదని .. వారిని సరిదిద్దే అవకాశం ఉంటుందని తమన్ అన్నారు. ఒక సంగీత దర్శకుడిగా తాను కేవలం ఐదారుగురు గాయనీగాయకుల్ని మాత్రమే పరిచయం చేయగలిగానని ప్రతిభను మెరుగు పరుచుకునే ఇలాంటి షోల వల్ల మరింత మందికి అవకాశం ఇవ్వొచ్చని తమన్ తెలిపారు. 10 ఏళ్ల కెరీర్ లో తమన్ 100 పైగా సినిమాలకు సంగీత దర్శకుడిగా పని చేసిన సంగతి తెలిసిందే.