Begin typing your search above and press return to search.

కరోనాని కేర్ చేయని మ్యూజిక్ డైరెక్టర్స్

By:  Tupaki Desk   |   28 March 2020 11:50 AM GMT
కరోనాని కేర్ చేయని మ్యూజిక్ డైరెక్టర్స్
X
కరోనా వైరస్ వల్ల చిత్ర పరిశ్రమ లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న చిత్రాలు షూటింగ్ షెడ్యూళ్లను రద్దు చేసుకున్నాయి. ఇక సెలెబ్రెటీలు ఇంటికే పరిమితమై సోషల్ మీడియాతో కొంతమంది కాలక్షేపం చేస్తుంటే, మరికొందరు తమలో దాగివున్న ఒక్కొక్క టాలెంట్ ను బయటకి తీస్తూ వాడిని వీడియోలలో బంధించి తమ అభిమానులకు అందిస్తున్నారు. సినిమాకి సంబందించిన 24 క్రాఫ్ట్స్ లలో ఒకటైన మ్యూజిక్ మాత్రం తనపని అది చేసుకుంటూ పోతూ ఉంది. నిన్న రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఆర్ ఆర్ ఆర్ టీం ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వీడియో చేయడానికి చిత్ర బృందం చాలానే కష్టపడింది. ఈ వీడియో కోసం డైరెక్టర్ రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, హీరో ఎన్టీఆర్, తమిళ్ లిరిక్ రైటర్ కార్కీ లు వీడియో కాల్ ద్వారా కసరత్తులు చేసారు. వీడియో కాల్ లో ఒకరినొకరు గైడ్ చేసుకుంటూ వీడియో రెడీ చేసారు.

కరోనా డేస్ ని వేస్ట్ చేయడం ఎందుకని ఇప్పుడు మన టాలీవుడ్ లో అందరూ ఇదే ఫాలో అవుతున్నారని తెలుస్తున్నది. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ వీడియో కాల్ ద్వారా మ్యూజిక్ సిట్టింగ్స్ వేస్తున్నారు. ఇప్పటికే దేవిశ్రీప్రసాద్, థమన్, గోపి సుందర్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ అదే పనిలో ఉన్నారంట. నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న '18 పేజెస్' సినిమా కోసం సంగీత దర్శకుడు గోపి సుందర్ వీడియో కాల్ ద్వారా మ్యూజిక్ సిట్టింగ్స్ జరుపుతున్నట్లు సమాచారం. మిగతా సంగీత దర్శకులు కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారట. ఏదేమైనా ఈ కరోనా టైం అందరికి కలిసి రాకపోవచ్చు కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కి మాత్రం కలిసి వచ్చిందనే చెప్పాలి. కరోనా వైరస్ కంట్రోల్లోకి వచ్చే వరకు ఇది ఇలాగె కొనసాగే అవకాశం ఉంది. కరోనా వైరస్ అన్నింటిని భయపెట్టగలిగింది కానీ సంగీతాన్ని భయపెట్టలేకపోయింది.