Begin typing your search above and press return to search.

సంగీతానికి ఎప్పుడూ గోల్డెన్ ఎరానే - దేవీశ్రీ ప్ర‌సాద్‌

By:  Tupaki Desk   |   27 Feb 2022 4:30 AM GMT
సంగీతానికి ఎప్పుడూ గోల్డెన్ ఎరానే - దేవీశ్రీ ప్ర‌సాద్‌
X
సంగీతంలో తన కంటూ ప్ర‌త్యేక ముద్ర సృష్టించుకున్న సంగీత ద‌ర్శ‌కుడు దేవీశ్రీ ప్ర‌సాద్. అటు మాస్ సినిమాల‌కు, ఇటు క్లాస్ సినిమాల‌కు ఒకేసారి బాణీలు క‌ట్టి శ్రోత‌ల హృద‌యాల‌ను దోచుకోవ‌డంలో దిట్ట‌. తాజాగా దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతం స‌మ‌కూర్చిన సినిమా `ఆడ‌వాళ్ళు మీకు జోహార్లు`. ఇందులో `మాంగ‌ల్యం తంతునా..` అనే పాట సంద‌ర్భాన్ని ఫోన్‌లో విని వెంట‌నే ట్యూన్ క‌ట్టేశారు. శ‌ర్వానంద్‌, ర‌ష్మిక మండ‌న్న జంట‌గా న‌టించిన `ఆడ‌వాళ్ళు మీకు జోహార్లు`లో పాట‌లు ఇప్ప‌టికే ఆద‌ర‌ణ పొందుతున్నాయి. కిశోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ చిత్రం మార్చి 4న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌కానుంది. ఈ సంద‌ర్భంగా దేవీశ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రంలోని సంగీతం గురించి, చిత్ర క‌థకు త‌న కుటుంబానికి గ‌ల అసంబంధాన్ని గురించి ప‌లు విష‌యాల‌ను మీడియాతో ఇలా పంచుకున్నారు.

ద‌ర్శ‌కుడు కిశోర్ తిరుమ‌ల కాంబినేష‌న్‌లో మీరు 4వ సినిమా చేశారు. మీకున్న కంఫ‌ర్ట్ ఏమిటి?
త‌న‌తో సినిమా చేయ‌డం అంటేనే చాలా కంఫర్ట్‌గా వుంటుంది. ఆయ‌న చాలా క్రియేటివ్ ప‌ర్స‌న్‌. క‌థ చెప్పేట‌ప్పుడే ఎక్క‌డ పాట రావాలి. ఎక్క‌డ ట్యూన్ పెట్టాల‌నేవి వివ‌రిస్తారు. ఆయ‌న చిత్రాల‌న్నీ సాంగ్స్ బేస్డ్‌ క‌థ‌లే. ఆయ‌న సినిమాల్లో ఎమోష‌న్ తో బాటు ఎంట‌ర్‌టైన్ మెంట్ కూడా వుంటుంది. `ఆడ‌వాళ్ళు మీకు జోహార్లు` సినిమా కిశోర్ కెరీర్‌లో బెస్ట్ మూవీ అని చెప్ప‌గ‌ల‌ను. నేను పాట‌లు చేసేట‌ప్పుడు బాగా ఎంజాయ్ చేశాను. లాక్‌డౌన్ స‌మ‌యంలోనే జూమ్‌లోనే నాకు ఈ క‌థ చెప్పారు. క‌థ చెప్పిన‌ప్పుడే మూడు, నాలుగు పాయింట్ల‌కు ఐడియా చెప్పాను.`మాంగ‌ల్యం తంతునామా` నేప‌థ్యం చెప్ప‌గానే వెంట‌నే ట్యూన్ వ‌చ్చేసింది. ఏదైనా ఆయ‌న క‌థ చెప్ప‌గానే ఐడియా వ‌చ్చేస్తుంది. అందుకే ఆయ‌న‌తో క‌లిసి సినిమా చేయ‌డం చాలా కంఫ‌ర్ట‌బుల్‌గా వుంటుంది. అదేవిధంగా టైటిల్ సాంగ్ అనుకుంటున్న‌ప్పుడు దానికి ఫ‌న్ క‌లిపితే బాగుంటుంద‌ని అనుకోవ‌డం వెంట‌నే చేయ‌డం జ‌రిగిపోయాయి. వింటే మీకే అర్థ‌మ‌వుతుంది.

యూత్ ఫుల్ సినిమాకూ ఫ్యామిలీ సినిమాకు బాణీలు క‌ట్టేట‌ప్పుడు ఎలా అనిపిస్తుంది?
ఫ్యామిలీ ఎమోష‌న్స్ వున్నా ఇది కూడా ల‌వ్ స్టోరీనే. దానికితోడు ఫ‌న్ కూడా వుంటుంది. శ‌ర్వానంద్ బెస్ట్ ఫెర్ ఫార్మెన్స్ ఇచ్చారు. ర‌ష్మికకు `పుష్ప‌` త‌ర్వాత వెంట‌నే ఈ సినిమా రావ‌డం ప్ల‌స్ అవుతుంది. అందులో త‌ను విలేజ్ కేరెక్ట‌ర్ ప్లే చేస్తే, ఇందులో మోడ్ర‌న్ అమ్మాయిగా న‌టించింది. ఇక ఖుష్బూ, రాధిక‌, ఊర్వ‌శి గారు సినిమాకు హైలైట్‌. ఫ్యామిలీసే కాదు. పిల్ల‌లు, యూత్ ను కూడా వినోదం క‌లిగించే సినిమా ఇది. నిర్మాత ద‌ర్శ‌కుడు సినిమా చూడ‌మ‌న్నారు. చూశాను. తెగ న‌చ్చేసింది. సినిమా మిక్సింగ్‌లో మూడు సార్లు చూశాను.

ఈ సినిమాలో వున్న ఎమోష‌న్స్ మీ కుటుంబంతో వున్న‌ప్పుడు ఫీల‌యిన‌ సంద‌ర్భాలున్నాయా?
క‌థ ఏమిట‌నేది టీజ‌ర్‌, ట్రైల‌ర్లోనే అర్థ‌మ‌యిపోయింది. ఇంత మంది ఫ్యామిలీ మెంబ‌ర్లు వుండ‌గా కుర్రాడి లైఫ్ ఎలా వుంటుంది అనేది నా రియ‌ల్ లైఫ్‌లోనూ చ‌విచూశాను. నేను ఈ సినిమా జ‌రుగుతున్న‌ప్పుడు మా ఊరు వెళితే సేమ్ టుసేమ్‌.. అత్త‌లు, మామ‌య్య‌లు, బామ్మ‌లు, చిన్న‌త్త‌లు, పెద్ద అత్త‌లు, అక్క‌లు, క‌జిన్స్‌, పిల్ల‌లు ఇలా చుట్టాలంద‌రూ వ‌చ్చేవారు. వీరంద‌రికీ నేనంటే చాలా ఇష్టం. నా క‌జిన్స్ న‌న్ను ముద్దు చేసేస్తారు. అందుకే ఇవ‌న్నీ గుర్తుకు వ‌చ్చేవి. అవి ఫొటోలు తీసి ద‌ర్శ‌కుడు కిశోర్‌కు పంపేవాడిని. ఈ సినిమాలాగానే వుంది నా లైఫ్ అంటూ చెప్పేవాడిని.

మీరు జోహార్లు చెప్పాల్సి వ‌స్తే ఎవ‌రికి చెబుతారు?
మొద‌ట అమ్మ‌కే చెబుతాను. మా త‌ల్లిగారి గురించి అంద‌రికీ తెలిసిందే. ఇప్ప‌టికీ మా ఫ్యామిలీలో అంతా సంతోషంగా వున్నామంటే మా అమ్మే కార‌ణం. మా తండ్రిగారికి 32 ఏళ్ళ వ‌య‌స్సులోనే గుండెపోటు వ‌చ్చింది. మా అమ్మ‌గారు చిన్న‌పిల్లాడిలా ద‌గ్గ‌రుండి చూసుకునేది. మా అమ్మ‌గురించి నాన్న గారు ఎప్పుడూ ఒకేమాట చెబుతుండేవారు. మా ఆవిడ‌కు న‌లుగురు పిల్ల‌లు నాతో క‌లిపి అని అనేవారు.

ఈ సినిమాలో వైవిధ్య‌మైన నాలుగు పాటలు వ‌చ్చాయి. క‌థ‌కు అంత స్పాన్ వుందా?
క‌థ‌లో అంత స్పాన్ వుంది కాబ‌ట్టే సంగీతం కుదిరింది. అందుకే వేరియేష‌న్ ట్యూన్స్ కూడా కుదిరాయి. నాలుగు పాట‌లు కాకుండా మ‌రో స‌ర్‌ప్రైజ్ సాంగ్ కూడా ఒక‌టి వుంది.

మీకు శ‌ర్వానంద్‌లో న‌చ్చిన పాయింట్ ఏది?
శ‌ర్వానంద్ నాకు `శంక‌ర్ దాదా ఎం.బి.బి.ఎస్‌.`నుంచీ తెలుసు. అందులో ఒక పాత్ర వేశాడు. సాంగ్‌లోకూడా పాల్గొన్నాడు. ఎప్ప‌టినుంచో సినిమా చేయాల‌ని అనుకునేవాళ్ళం. అది కిశోర్ వ‌ల్లే కుదిరింది. గోవాలో షూట్ చేస్తుండ‌గా సినిమాపై చాలా చ‌ర్చించాం. హ్యాపీగా అనిపించింది.

పుష్ప‌కు ఈ సినిమాకు మార్పు ఎలా అనిపించింది?
ఏదైనా సినిమాకు సినిమాకు కొత్త‌ద‌నం వుంటుంది. `రంగ‌స్థ‌లం` చేస్తున్న‌ప్పుడు మ‌రోవైపు `భ‌ర‌త్ అనే నేను` చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్ ఒకేసారి చేశాను. అది రూర‌ల్ అయితే, ఇది మోడ్ర‌న్ బేక్‌డ్రాప్‌. త‌ప్ప‌కుండా వేరియేష‌న్ చూపించాలి. ఇక పుష్ప ర‌గ్గెడ్ సినిమా. ఆడ‌వాళ్ళు మీకు జోహార్లు`కూల్ సినిమా. పుష్ప ప్ర‌మోష‌న్ టైంలో సుకుమార్‌గారికి ఇందులో పాట వినిపించాను. రెండు లైన్‌లు విని `డార్లింగ్ సూప‌ర్ హిట్‌` అని చెప్పేశారు. అనిల్ రావిపూడి, బాబీ ఇలా చాలామంది టైటిల్ సాంగ్‌ను మెచ్చుకున్నారు.

ప్ర‌స్తుతం ఏ పాట అయినా ఎంద‌రికో రీచ్ అవుతుంది? మ్యూజిక్‌కు ఇది గెల్డెన్ ఎరా అనుకోవ‌చ్చా?
సంగీతానికి ఎప్పుడూ గోల్డెన్ ఎరానే. అందుకే వందేళ క్రితం పాట‌ల‌ను ఇంకా ఇప్ప‌టికీ గుర్తుపెట్టుకుంటున్నాం. వాటిని మ‌ర్చిపోలేదు. మైకేల్ జాక్స‌న్‌, ఎం.ఎస్‌. విశ్వ‌నాథ‌న్‌, ఇళ‌యారాజా ఇలా ఎంద‌రో వున్నారు. వారు సంగీతం చేసిన‌ప్పుడు సోష‌ల్ మీడియా లేదు. సంగీతం తీరాలు దాటి వెళుతూనే వుంటుంది. ల‌క్ష‌లు, మిలియ‌న్ల వ‌చ్చాయంటే నాకు అది గ్రేట్ అనిపించ‌దు.

ఇన్ని బాణీలు క‌ట్టిన మిమ్మ‌ల్ని కొత్త‌గా డ్రైవ్ చేసేది ఏమిటి?
ఐ ల‌వ్ మ్యూజిక్. నేను మ్యూజిక్. ప్రేమికుడిని. అదే న‌న్ను ముందుకు న‌డిపిస్తుంది. ఈనెల 28న మా గురువుగారు మాండొలిన్ శ్రీనివాస్ గారి జ‌యంతి. అందుకే ఆయ‌న కోసం కొత్త ప్రోగ్రామ్ చేస్తున్నా.

మీరు చేస్తున్న కొత్త సినిమాలు?
ఎఫ్ 3 చేస్తున్నా. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవిగారి సినిమాలో మూడు పాట‌లు చేసేశాం. హ‌రీష్ శంక‌ర్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబినేష‌న్ మూవీ చేయ‌బోతున్నా. వైష్ణ‌వ్ తేజ్ తో రంగ‌రంగ వైభ‌వంగా.. అదేవిధంగా బాలీవుడ్ మూవీ చేస్తున్నా.