Begin typing your search above and press return to search.
సింగర్ ఫర్మానీపై ముస్లిం పెద్దల నారజ్.. వాళ్లకు బుద్ధి చెప్పరేం?
By: Tupaki Desk | 1 Aug 2022 3:30 PM GMTతప్పు ఎవరు చేసినా తప్పే. మేం ఎవరికి తొత్తులం కాదు. ఈ దేశంలో హిందువులకు ఉండే ప్రాధాన్యం వారికి కచ్ఛితంగా దక్కాల్సిందే. అదే సమయంలో ముస్లింలకు ఇతర మతస్తులకు సమాన గౌరవ మర్యాదలు దక్కాల్సిందే. హిందువులకు సంబంధించి ప్రతి దానికి నీతులు చెప్పేటోళ్లు.. అలాంటివే ఇతర మతస్తుల విషయంలో చోటు చేసుకున్నా.. అలానే రియాక్టు కావాల్సిందే. నిత్యం బోధనలు చేసే వారు.. కొందరి విషయాల్లో అత్యుత్సాహాన్ని.. మరికొందరి విషయంలో అస్సలు పట్టనట్లుగా ఉండటం ఏ మాత్రం సరికాదు.
తాజాగా సింగర్ ఫర్మానీ ఉదంతం గురించి విన్నప్పుడు.. ఆమె పాడిన శివయ్య పాటపై ముస్లిం మత పెద్దలు కొందరు ఆగ్రహం చేసిన వైనంపై ఎవరో ఎందుకు.. ఆ మతానికి చెందిన ఓవైసీ లాంటి మేధావులు స్పందించాల్సిన అవసరం ఉంది. అందుకు భిన్నంగా మౌనంగా ఉండటం కచ్ఛితంగా తప్పే అవుతుంది. ఇంతకీ తాజా ఇష్యూ ఏమంటే.. యూట్యూబ్ సెన్సేషన్.. ఇండియన్ ఐడల్ ఫేమ్ ఫర్మానీ నాజ్ తాజాగా పాడిన ‘హర్ హర్ శంభూ’ పాట వైరల్ అయ్యింది. హిందూ దైవం శివుడి మీద పాట పాడిన పాటపై కొన్ని ముస్లిం సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఆమె చేసింది ఇస్లాం వ్యతిరేక చర్యగా ఫత్వాలు జారీ చేయటం వివాదంగా మారింది. శివయ్య మీద పాట పాడటం ఇస్లాం వ్యతిరేక చర్యగా అభివర్ణిస్తున్న వారిని పలువురు తప్పు పడుతున్నారు. యూపీకి చెందిన ఇస్లాం మతపెద్ద.. అసద్ ఖ్వాస్మీ పాపంగా.. ఘోరమైన నేరంగా అభివర్ణించటం గమనార్హం. అయితే.. హిందూ సంఘాలు మాత్రం ఆమెకు మద్దతుగా నిలుస్తున్నాయి.
మనం ఏదైనా తమ వ్రత్తి జీవితంలో భాగంగా చేసే పనిని పాపంగా పరిగణలోకి తీసుకోవటం.. ఇప్పటి రోజుల్లో తప్పు కాక మరేమిటి? ఇలాంటి తీరును ఖండించాల్సిన అవసరం ఉంది. మత సహనం గురించి పెద్ద పెద్ద లెక్చర్లు ఇచ్చే మేధావులు ఇప్పుడు గళం విప్పాల్సిన అవసరం ఉంది. ఇంతకీ ఫర్మానీ నాజ్ గురించిచెబితే.. రీల్ కథకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఆమె జీవితం ఉంటుంది. ఆమెకు యూట్యూబ్ లో 3.84 మిలియన్లకు పైగా సబ్ స్కైబర్లు ఉన్నారు.
2017లో వివాహం చేసుకున్న ఆమెకు ఒక కొడుకు ఉన్నారు. అతడికి జబ్బు చేయటంతో భర్త ఆమెను వేధించేవారు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయారు. ఆమె గొంతు బాగుండటంతో స్థానికంగా ఉండే ఒక కుర్రాడు ఆమె పాటల్ని యూట్యూబ్ లో అప్ లోడ్ చేయటం..అవి కాస్తా వైరల్ కావటంతో ఆమె సెలబ్రిటీ అయ్యారు. ఇండియన్ ఐడల్ లో పాల్గొన్నారు. కొడుకు అనారోగ్యం కారణంగా మధ్యలో వైదొలిగారు.
తాజా వివాదం నేపథ్యంలో ఆమె రియాక్టు అయ్యారు. కళాకారులకు మతంతో సంబంధం ఉండదన్న ఆమె.. సలీం మెహమ్మద్ రఫీ.. లాంటి వాళ్లు భజన.. హిందూ భక్తి పాటల్ని ఆలపించేవాళ్లు కదా? అంటూ సరైన వాదనను వినిపించారు. అన్ని మతాలకు సంబంధించిన అల్బమ్స్ ను అప్ లోడ్ చేస్తానని చెబుతున్న ఆమెకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. అయినా.. ఆపదలో ఉన్న వేళ.. ఇప్పుడు ఘోరం.. పాపం అంటున్న వాళ్లు ఆమెను ఆదుకోలేదన్న చేదునిజాన్ని మర్చిపోకూడదు. అప్పుడు లేని ప్రేమ సెలబ్రిటీ అయినంతనే గుర్తుకు రావటం ఏమిటో?