Begin typing your search above and press return to search.
స్లీవ్ లెస్ డ్రెస్ సృష్టించిన అలజడి!
By: Tupaki Desk | 26 Dec 2016 9:30 AM GMTసోషల్ మీడియాలో సెలబ్రెటీలు ఫోటోలు షేర్ చేసుకోవడం, ఆ ఫోటోలకు లక్షల సంఖ్యలో లైక్ లు, వేల సంఖ్యలో కామెంట్స్ రావడం సహజం. అయితే ఈ విషయంలో చాలా మందిపై నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తుంటాయి.. వాటిలో కొన్ని సహేతుకంగా అనిపిస్తుంటాయి. అయితే తాజాగా క్రికెటర్ షమీ భార్య విషయంలో వచ్చిన కొన్ని కామెంట్స్ ఇబ్బందికరంగా ఉన్నాయనే అనుకోవాలి. ఈ కామెంట్స్ పై మరో క్రికెటర్ కూడా తనదైన శైలిలో కౌంటర్ ట్వీట్ చేశారు! ఇంతకూ ఏమి జరిగిందో ఇప్పుడు చుద్దాం...
భారత పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ - తన భార్య హసిన్ జహాన్ తో కలిసి దిగిన ఓ ఫోటోను సరదాగా ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. దీంతో ఆయన అభిమానులు - క్రికెట్ అభిమానులు లైక్స్ కొడుతూ, అభినందనలతో కూడిన కామెంట్స్ చేస్తూ ఉండగా... షమీ నువ్వు అసలైన ముస్లింవేనా అంటూ మరోరకం కామెంట్ల వర్షం కురిసింది. ఇంతకూ దానికి కారణం ఏమిటంటే... ఆ ఫోటోలో హసిన్ జహాన్ స్లీవ్ లెస్ గౌను ధరించి ఉంది. దీంతో కొంతమంది నెటిజన్లు రెచ్చిపోయారు. ఇదే పిక్ పై మరికొందరు ముస్లింలు షమీకి అండగా నిలిచారు కూడా. వీరిలో ప్రముఖ సీనియర్ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ ఒకరు.
షమీ భర్య పై వచ్చిన కామెంట్స్ పై కైఫ్ సీరియస్ గానే స్పందించాడు. "షమీకి నా మద్దతు ఉంటుంది.. ఇలాంటి వ్యాఖ్యలు సిగ్గుపడేలా ఉన్నాయి.. దేశంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి.. నేను ఏమి చెప్పాలనుకున్ననో అన్న విషయం అర్ధమయ్యే ఉంటుంది.." అని కైఫ్ ట్విట్ చేశాడు. ఇదే క్రమంలో మరికొందరు నెటిజన్లు స్పందిస్తూ... "ఎవరికి ఇష్టం వచ్చిన దుస్తులు వారు ధరిస్తారు.. మీ పని మీరు చూసుకోండి" అంటూ స్లీవ్ లెస్ డ్రెస్ పై కామెంట్లు చేసిన వారిపై స్పందించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/