Begin typing your search above and press return to search.
`బొంబాయి` తర్వాత మళ్లీ మత వివాదంలో
By: Tupaki Desk | 8 Aug 2021 5:56 AM GMT`బొంబాయి` సినిమాతో మణిరత్నం సృష్టించిన ప్రకంపనాలు అన్నీ ఇన్నీ కావు. దేశంలో నాటి మత ఘర్షణల నేపథ్యంలో వాస్తవిక ఘటనలను ఎంచుకుని అందులో హిందూ ముస్లిమ్ ప్రేమకథను హృద్యంగా తెరపై ఆవిష్కరించి సంచలనాలకు తెర తీసారు. దాంతో బొంబాయి చిత్రం వివాదాస్పదమైంది. 1996 మార్చి 11న ఈ సినిమా రిలీజైంది. చాలా చోట్ల థియేటర్లపై దాడులు జరిగాయి. కొన్ని చోట్ల ముస్లిములు థియేటర్లను తగలబెట్టారు. మణిరత్నం ఇంటిపైనా దాడులు జరిగాయి. నాడు మణిరత్నం ఇంటికి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాల్సి వచ్చిందంటే అర్థం చేసుకోవాలి.
ఆ తర్వాత కూడా మణిరత్నం సినిమాలు చాలాసార్లు వివాదాస్పదమయ్యాయి. ఇప్పుడు మరోసారి హిందూ-ముస్లిమ్ వివాదం తెరపైకొచ్చింది. తాజాగా `నవరస` చిత్రంపై ముస్లింలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మణిరత్నం నిర్మించిన ఈ సినిమాలో వివాదాస్పద అంశాలున్నాయి. వివరాల్లోకి వెళితే.. `నవరస` అనేది మణిరత్నం నిర్మించిన తొమ్మిది చిత్రాల సంకలనం. ఇది ఈ వారాంతంలో నేరుగా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. తొమ్మిది రసాల ఆధారంగా తొమ్మిది లఘు చిత్రాలు ఈ సిరీస్ లో ఉన్నాయి. ఈ సిరీస్ సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. చాలా మంది వీక్షకులు ఈ 9 కథలలో కనీసం 5 కథలు బాగున్నాయని ప్రశంసించారు. ఈ ప్రతి షార్ట్ ఫిల్మ్ కి విభిన్న దర్శకులు పని చేశారు. అరవింద్ స్వామి- గౌతమ్ మీనన్- కార్తీక్ సుబ్బరాజ్- ప్రియదర్శన్ తదితరులు దర్శకత్వం వహించారు.
అయితే ప్రచారం కోసం పవిత్ర ఖురాన్ లోని పద్యాలను ఉపయోగించడంతో దానికి ముస్లిములు అభ్యంతరం చెబుతున్నారు. అలాగే ఈ 9 కథలలో ఒకదానిలో ఖురాన్ పద్యాల గురించి ప్రస్తావనలు ఉన్నాయి. ఇది కొంతమంది ముస్లిమ్ సోదరులను కలవరపెట్టింది. రజా అకాడమీ అనే ముస్లిం సంస్థ ట్వీట్ చేస్తూ..`` డైలీ తంతి వార్తాపత్రికలో నెట్ ఫ్లిక్స్ తన సినిమా నవరస నుంచి ఖురాన్ పద్యం ప్రచురించింది. ఇది ఖురాన్ కు అవమానం. నెట్ ఫ్టిక్స్ ఇండియాపై కఠిన చర్యలు తీసుకోవాలని మేం డిమాండ్ చేస్తున్నాము`` అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వివాదంపై మణిరత్నం కానీ లఘు చిత్రాల దర్శకులు కానీ స్పందించలేదు. నవరసను నెట్ ఫ్లిక్స్ బ్యాన్ చేయాలన్నది ప్రధాన డిమాండ్. మునుముందు ఏం జరగనుందో వేచి చూడాలి.
నెట్ ప్లిక్స్ తర్వాత అమెజాన్ పైనా ఎటాక్!
నెట్ ప్లిక్స్ నిరంతరం వివాదాలతో చెలిమి చేస్తోన్న సంగతి తెలిసిందే. ఓవైపు కంటెంట్ పరంగా హీటెక్కిస్తూ వివాదాలు ఎదుర్కోంటుంది. మరోవైపు ప్రచార కార్యక్రమాల్లోనూ నెట్ ప్లిక్స్ వివాదాలతో మంటలు పుట్టిస్తోంది. `నవరస` వెబ్ సిరీస్ పోస్టర్ విషయంలో వివాదం చినికి చినికి గాలివాన అవుతోంది. ఇస్లాం మతస్థుల మనోభావాలు దెబ్బతీసేలా పోస్టర్ లో ఖురాన్ కి చెందిన శ్లోకాల్ని ప్రచురించి మంట రేపారు. దీంతో ముస్లీములు సోషల్ మీడియా వేదికగా బ్యాన్ నెట్ ప్లిక్స్ అని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకుముందు చాలా సిరీస్ ల విషయంలో నెట్ ఫ్లిక్స్ చిక్కుల్లో పడింది. కొన్నిటిపై ఇప్పటికీ కోర్టుల్లో విచారణ సాగుతూనే ఉంది.
మరో దిగ్గజ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో సైతం వివాదాలకు దూరంగా లేదు. ఇటీవల `ఫ్యామిలీ మ్యాన్ -2` వెబ్ సిరీస్ ని అమెజాన్ వాళ్లు బ్యాన్ చేయాలంటూ ఆందోళన కొనసాగింది. ఫ్యామిలీమేన్ -2 వెబ్ సిరీస్ కంటెంట్ సహా కొన్ని అంశాలు వివాదాస్పదం ఉన్నాయనే అంశం తెర మీదకు వచ్చింది. ఈ కారణంగా ఆ సిరీస్ ను నిలిపివేయాలని తమిళనాడు ప్రజలు అగ్రహం వ్యక్తం చేసారు. ఇలాంటి సిరీస్ లు సమాజంపై ప్రభావితం అవుతాయని ఆందోళన వ్యక్తమైంది.
నెట్ ప్లిక్స్ కార్పొరెట్ వివాదాస్పద కంటెట్ తోనే బోలెడంత ఉచిత పబ్లిసిటీ కొట్టేస్తోంది. తరుచూ నెట్ ప్లిక్స్ ఏదో ఒక వివాదం సాధారణం అయిపోయింది. ఇప్పుడు అదే బాటలో అమెజాన్ కూడా వెళుతోందనే సంకేతం అందింది. నెట్ ప్లిక్స్ లాంటి ఓటీటీ సంస్థల్ని ఆదర్శంగా తీసుకుని మిగతా ఓటీటీలు ఆ రకమైన ధోరణితో ముందుకెళ్తున్నాయన్న విమర్శ వినిపిస్తోంది. అయితే ప్రాంతీయ ఓటీటీలకు ఇంకా దేశ వ్యాప్తంగా అంతగా ఐడెంటిటీ లేకపోవడంతో అంతగా వివాదాలు బయటపడడం లేదు.