Begin typing your search above and press return to search.
వీరప్పన్ వైఫ్ ని వర్మ మోసం చేశాడట
By: Tupaki Desk | 8 July 2016 9:30 AM GMTగంధం చెక్కలు.. ఏనుగు దంతాల స్మగ్లర్ వీరప్పన్ సతీమణి ముత్తులక్ష్మీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ సోషల్ మీడియాలోనూ.. వార్తల్లోనూ నిలిచే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తనను మోసం చేసినట్లుగా ఆమె వ్యాఖ్యానించారు. ఇటీవల వీరప్పన్ పేరుతో ఒక చిత్రాన్ని రాంగోపాల్ వర్మ రూపొందించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఆర్థిక ఒప్పందంలో ఆయన తనను మోసం చేసినట్లుగా ఆమె ఆరోపిస్తున్నారు.
వీరప్పన్ చిత్రం కాపీరైట్ కోసంరూ.25క్షలు తీసుకున్న ముత్తులక్ష్మి.. ఇప్పుడు రాంగోపాల్ వర్మ మీద పలు ఆరోపణలు చేస్తున్నారు. మరింత డబ్బు తీసుకొని కూడా ఎందుకలా విమర్శలు చేస్తున్నారంటూ అన్న ప్రశ్నలకు ముత్తు లక్ష్మి బదులిస్తూ.. అగ్రిమెంటు పేపర్లలో ఏం ఉందో కూడా చెప్పకుండా సంతకాలు తీసుకున్నారని ఆమె చెబుతున్నారు. అవగాహన లేక తాను సంతకాలు చేసినట్లుగా చెబుతున్న ముత్తులక్ష్మి.. ఈ సినిమా తమిళ వెర్షన్ ను తానే విడుదల చేయాలని అనుకున్నానని.. కానీ రాంగోపాల్ వర్మ మాత్రం తనకిచ్చిన మాటను తప్పినట్లుగా ఆమె ఆరోపిస్తున్నారు. మరి.. ముత్తులక్ష్మి ఆరోపణలకు ఆర్జీవీ రియాక్ట్ అవుతారా..?