Begin typing your search above and press return to search.

నా వ‌య‌సు 30.. నాకు ఇద్ద‌రు బ్ర‌ద‌ర్స్

By:  Tupaki Desk   |   5 Aug 2019 6:14 AM GMT
నా వ‌య‌సు 30.. నాకు ఇద్ద‌రు బ్ర‌ద‌ర్స్
X
కింగ్ నాగార్జున గురించి అభిమానులు ఏమ‌ని ఫీల‌వుతున్నారు? ఆయ‌న‌కు 60 వ‌య‌సు వచ్చేసినా ఇంత‌గా చెల‌రేగిపోతున్నారు? గాళ్స్ తో రొమాన్స్ అద‌ర‌గొట్టేస్తున్నారు.. ఆయ‌నేమైనా అమృతం తాగి నిత్య‌య‌వ్వ‌నుడ‌య్యారా? అంటూ ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారు. మొన్న మ‌న్మ‌ధుడు 2 ట్రైల‌ర్ చూశాక ఆయ‌న‌లోని రోమియోని త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌లేదు. అస‌లింత‌కీ వ‌య‌సు విష‌య‌మై నాగార్జున మ‌న‌సులో ఎలాంటి ఫీలింగ్ ఉంది? అంటే .. ఆయ‌నే స్వ‌యంగా మ‌న్మ‌ధుడు 2 ప్రీరిలీజ్ వేడుక‌లో ఓపెన్ అయిపోయారు.

త‌న మ‌న‌సు ఏం కోరుకుంటోందో బ‌హిరంగంగానే చెప్పారు. త‌న‌కు ఈ నెలాఖ‌రుతో 60 వ‌చ్చేస్తున్నా.. నా వ‌య‌సు 30 మాత్ర‌మే అంటూ షాకిచ్చారు. నా వ‌య‌సు 30.. నాకు ఇద్ద‌రు బ్ర‌ద‌ర్స్! అంటూ నాగార్జున ఎంతో ఎన‌ర్జిటిక్ గా అభిమానుల‌కు చెప్పారు. ఈ వ‌య‌సులో రొమాన్స్ కి ముద్దుల‌కు తాను సిద్ధ‌మేన‌ని గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఇంత‌కీ నాగార్జున ఇద్ద‌రు బ్ర‌ద‌ర్స్ ఎవ‌రో తెలుసు క‌దా! నాగ‌చైత‌న్య - అఖిల్ ఇద్ద‌రూ ఆయ‌న‌కు బ్ర‌ద‌ర్స్. నిజ‌మే నిన్న‌టిరోజున ఆయ‌న `మ‌న్మ‌ధుడు 2` ప్రీరిలీజ్ మీద‌కు ఎంట్రీ ఇస్తూ ర‌కుల్ తో ర‌ఫ్ఫాడుకున్న తీరు అది నిజ‌మే సుమీ అనిపించింది. ఏజ్ తో ప‌నేముంది? జోష్ తోనే ఉంది! అంతా అని నిరూపించారు. కింగ్ కి ఛాన్సివ్వాలే కానీ జోష్ సీక్వెల్ లో న‌టించి హిట్ కొట్టినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు.

కింగ్ ఫీలింగ్ అలా ఉంటే మ‌రి నాగ‌చైత‌న్య ఫీలింగ్ ఎలా ఉంది? డాడ్ ని బ్ర‌ద‌ర్ గా అంగీక‌రించే మంచి మ‌న‌సు త‌న‌కు ఉందా? అంటే .. ఇదే వేదిక‌పై డాడ్ కి చైతూ ఇచ్చిన కాంప్లిమెంట్ మామూలుగా లేదు. ఈ మధ్య నాన్న ప్రీ రిలీజ్ ల‌కు రావాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. ముందేమో అందరూ బ్రదర్స్ లాగా ఉన్నారని అనేవారు. సరే లే లుక్స్ తో మ్యానేజ్ చేసేయొచ్చు అనుకుంటే.. ఇప్పుడు కంటెంట్ కూడా అలాగే ప్ర‌య‌త్నిస్తున్నారు నాన్న. ఈ టైమ్‌లో ఒక ప్రేమ‌క‌థ‌లో న‌టిస్తున్నారు. అందుకే ఆయ‌న రియ‌ల్ కింగ్. అమేజింగ్ నాన్న. ఒక హిట్టోస్తే మళ్ళీ మేము అదే ప్యాట్రన్‌ లో మరో రెండు సినిమాలు సేఫ్టీకోసం చేస్తుంటాం. ప్లాప్ వస్తే జాగ్రత్తగా స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటాం. కానీ నాన్న మాత్రం హిట్టొచ్చినా ప్లాప్ వచ్చినా ప్రతి స్టెప్ ధైర్యంగానే తీసుకుంటున్నార‌ని చైతూ కితాబిచ్చారు. మొత్తానికి నాన్న కాదు బ్ర‌దర్ అని కింగ్ కి స‌ర్టిఫికెట్ ఇచ్చేశాడు చైతూ.