Begin typing your search above and press return to search.
నా అందం నా ఇష్టం
By: Tupaki Desk | 2 Oct 2017 10:18 AM GMTరక్త చరిత్రలో సాధారణ మహిళ గా కనిపించే సరికి రాధిక ఆప్టేను ఎవరో సీరియల్ యాక్టర్ అనుకున్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత అమ్మడి ఫోటో షూట్స్ చూసేసరికి అందరు షాక్ అయ్యారు. తెలుగులో బాలయ్య సరసన రెండు సినిమాలను చేసిన ఈ హాట్ బ్యూటీ.. బాలీవుడ్ లో మంచి స్పైసి గర్ల్ అని తెలుసుకున్నారు. నార్త్ సౌత్ అని తేడా లేకుండా అన్ని భాషల్లోనూ నటించి నటిగా మంచి గుర్తింపునే తెచ్చుకుంది.
ఆదరణ బాగానే దక్కించుకున్నా అమ్మడు అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో రిలీజ్ చేసే ఫొటోస్ తో కాస్త నెగిటివ్ టాక్ ని తెచ్చుకుంది. ఫొటోస్ రిలీజ్ చేసిందంటే చాలు దాదాపు కొన్ని రోజుల వరకు రాధికా ఆప్టే గురించే మాట్లాడుకోవాలి. ఇక రీసెంట్ గా ఓ ఈవెంట్ కి వెళ్లిన రాధికా ఎప్పుడు కనిపించని విధంగా కనిపించి మారోసారి అందరిని షాక్ కి గురి చేసింది. ఈవెంట్ కి వచ్చిన వారందరు రాధికా వైపే చూస్తూ ఉండిపోయారు. తెల్లటి గ్లామర్ దుస్తుల్లో అమ్మడు క్లివేజ్ షోతో చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది. అయితే సోషల్ మీడియాలో రాధికా ను బాగా ఫాలో అయ్యే నెటిజన్స్ ఆమెపై తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేశారు.
గ్లామర్ సంగతి పక్కన పెట్టు.. అసలు నువ్వు వేసిన డ్రెస్ ఏమైనా బావుందా చాలా ఛండాలంగా ఉందని ఎవరి స్టైల్ లో వారు కామెంట్స్ చేశారు. దీంతో రాధికకు ఒక్కసారిగా కోపం వచ్చేసింది. వస్తున్న కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. నా అందం నా ఇష్టం.. నాకు నచ్చినట్లు నేను ఉంటాను. నాకు సౌకర్యంగా వుండేలా నా కాస్ట్యూమ్స్ వుంటాయి. సో ఎవరో నా గురించి నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారని పట్టించుకోవాల్సిన అవసరం లేదని రాధికా చెప్పేసింది.