Begin typing your search above and press return to search.

పిల్లలు ఏంజెల్స్ అంటున్న రేణు దేశాయ్

By:  Tupaki Desk   |   4 Dec 2018 7:21 AM GMT
పిల్లలు ఏంజెల్స్ అంటున్న రేణు దేశాయ్
X
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తరచుగా తన పిల్లల గురించి సోషల్ మీడియాలో అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. వారికి సంబంధించిన ఫోటోల పై పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిని చూపిస్తుంటారు. పవన్ పిల్లల ఫోటోలు సోషల్ మీడియాలోకి రావడం ఆలస్యం.. వెంటనే వైరల్ అవుతుంటాయి.

రీసెంట్ గా అలానే పవన్ కుమారుడు అకీరా నందన్ ఫోటోను పోస్ట్ చేసింది రేణు. బ్లాక్ అండ్ వైట్ ఫిల్టర్ పిక్ అది. ఆ ఫోటో కు ఒక ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చింది. 'ఆద్య.. అకీరా ఇద్దరూ ఎంతో ఓపిగ్గా ఫోటోలకు పోజిస్తారు. ఏమాత్రం విసిగించరు. ఇలాంటి ఏంజెల్స్ ను పిల్లలుగా పొందిన నేను అదృష్టవంతురాలిని." ఇక ఫోటో గురించి మాట్లాడుకుంటే .. అకీరా అచ్చుగుద్దినట్టు పవన్ లా ఉన్నాడు. అందుకేనేమో ఫ్యాన్స్ ఇప్పటికే చాలాసార్లు అకీరా ను జూనియర్ పవర్ స్టార్ అని పిలుస్తూ ఉంటారు.

పవన్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత రేణు దేశాయ్ పూణే లో తన పిల్లతో పాటూ ఉంటోంది. ఈమధ్యే రెండో పెళ్ళి చేసుకునేందుకు సిద్దమయింది. ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. త్వరలో పెళ్ళి చేసుకోనుందని సమాచారం.