Begin typing your search above and press return to search.
నా ప్యాషన్ ను అనుసరించానంటున్న విజయ్
By: Tupaki Desk | 22 Jan 2019 7:19 AM GMTవిజయ్ దేవరకొండ క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. దాని గురించి స్పెషల్ గా మళ్ళీ చెప్పేదానికి ఏం లేదు. కానీ తాజాగా విజయ్ దేవరకొండకు ఒక ప్రత్యేకమైన గౌరవం లభించనుంది. సిగ్నేచర్ మాస్టర్ క్లాస్ షో సీజన్ 3 లో విజయ్ దేవరకొండ కూడా ఒక స్పీకర్ గా మాట్లాడతాడు. ఈ షో లో షారూఖ్ ఖాన్... కంగనా రనౌత్ లు ఇద్దరూ ఇతర స్పీకర్స్.
2016 లో స్టార్ట్ అయిన ఈ మాస్టర్ క్లాస్ షోలో రియల్ లైఫ్ లో సాధారణమైన నేపథ్యంనుండి స్టార్డమ్ దిశగా పయనించినవారి కథలు ఉంటాయి. వారు ఎలా తమ లక్ష్యం దిశగా పయనించారు.. ఏ విధంగా విజయం సాధించారు అన్నది వారే స్వయంగా వివరిస్తారు. హైదరాబాద్ నోవోటెల్ హోటల్ లో జనవరి 25 వ తేదీ జరగనున్న ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ హీరోగా తన ప్రస్థానాన్ని వివరిస్తాడు. మాస్టర్ క్లాస్ ప్యాషన్ టు పేచెక్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.
ఈ ప్రోమోలో "నేను ఒక అవుట్ సైడర్.. ఒక సర్ ప్రైజ్. ఒక సినిమాలో నటించేందుకు1000 మందితో నేను పోటీ పడాల్సి వచ్చేది. కానీ నాకు ఆ పోటీ ఇబ్బందిగా అనిపించలేదు. ఎందుకంటే.. నా దృష్టి అంతా నా లక్ష్యం మీదే. నా ప్యాషన్ ను నేను అనుసరించాను. నేనంటూ ఒక ముద్ర వేయగాలిగాను" అంటూ స్టైల్ గా చెప్పాడు విజయ్. యువకులకు.. తమ లక్ష్యం వైపు ప్రయాణించాలని అనుకుంటున్నవారికి విజయ్ మాటలు ఇన్స్పిరేషన్ ఇస్తాయనడం లో సందేహం లేదు. 25 వ తేదీ మాస్టర్ క్లాస్ లో ఇంకా ఏం చెప్తాడో వేచి చూడాలి.