Begin typing your search above and press return to search.
హీరోయిన్లతో తండ్రికున్న రిలేషన్స్ చెప్పాడు
By: Tupaki Desk | 17 Jan 2017 5:20 AM GMTజీవిత చరిత్రలు రాసే వారు చాలామంది తమ జీవితాల్లో జరిగినవి రాసుకున్నా.. సెన్సార్ ఎంతోకొంత చేసుకోకుండా సదరు ‘చరిత్ర’ బయటకు రాని పరిస్థితి. దాన్ని అర్థం చేసుకోవచ్చు కూడా. ఎంత పోటుగాడైనా.. తనలోని అసలు కోణాన్ని చూపించుకునే దమ్ము ధైర్యం ఉండదనే చెప్పాలి. అలా అని మొత్తంగా చెప్పకపోయినా.. కొన్ని అంశాల్ని కాస్త ధైర్యంగా చెప్పే ప్రయత్నం కొందరు చేస్తుంటారు.
చాలామంది పత్తిత్తుల మాదిరి.. తమ జీవిత కథల్ని చెప్పుకునే తరహాను పక్కన పెట్టి.. కొంతలో కొంతగా కొన్ని నిజాల్ని చెప్పుకొచ్చారు బాలీవుడ్ ప్రముఖ నటులు రిషీకపూర్. ‘‘ఖుల్లం ఖుల్లా: రిషీకపూర్ అన్ సెన్సార్డ్’’ పేరుతో తన స్వీయచరిత్ర రాసిన ఆయన.. ఇప్పుడు అందరి నోటా నానుతున్నారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ను తాను రెండుసార్లు కలిశానన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పేశారు. అయితే.. అదంతా ముంబయి పేలుళ్లకు ముందేనన్న విషయాన్ని చెప్పుకొచ్చారు.
తనను దావూదే కలిశాడని చెప్పిన రిషీకపూర్.. తవాయిఫ్ చిత్రంలో తన పాత్ర పేరు దావూద్ కావటంతోనే.. ‘డి’కి తనంటే ఇష్టమని పేర్కొన్నారు. భాయ్ తో తనకున్న రిలేషన్ గురించి చెప్పేసిన రిషీకపూర్.. తన తండ్రి ప్రముఖ నటుడు.. దర్శక నిర్మాత అయిన రాజ్ కపూర్ మీద సంచలన అంశాల్ని చెప్పుకొచ్చారు. సినిమాలు.. మద్యం.. హీరోయిన్లే తన తండ్రి లోకంగా చెప్పుకొచ్చారు. ప్రముఖ అలనాటి నటీమణులు నర్గీస్.. వైజయంతీమాల తదితర హీరోయిన్లతో తన తండ్రికున్న సంబంధాల గురించి చెప్పుకురావటంతో ఇప్పుడాయన పుస్తకంపై భారీ చర్చ సాగుతోంది. మొత్తానికి తండ్రికున్న రిలేషన్స్ ను చెప్పిన కొడుకుగా రిషీకపూర్ ఈ తరానికి గుర్తుండిపోతారేమో..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/