Begin typing your search above and press return to search.
నా తొలి పారితోషికం మూడు వందలే!
By: Tupaki Desk | 6 July 2021 6:30 AM GMTతెలుగులో కొంతకాలం క్రితం కథనాయికగా మెరిసినవారిలో 'కామ్నా జెఠ్మలాని' ఒకరు. ముద్దుగా .. బొద్దుగా మురిపించిన ఈ అమ్మాయి 'ప్రేమికులు' సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమైంది. తెరపై తెల్లగులాబీలా విరిసిన ఈ అమ్మాయిని చూడగానే కుర్రళ్ల కళ్లన్నీ కలలతో నిండిపోయాయి .. గుండెలన్నీ ఊహలతో పండిపోయాయి. అలా తొలి సినిమాతోనే ఈ సుందరి పడుచు హృదయాలను పొలోమంటూ దోచేసుకుంటూ వెళ్లింది. అలాంటి కామ్నా తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, తన గురించిన అనేక విషయాలను ఆవిష్కరించింది.
"నేను పుట్టి పెరిగింది ముంబైలో .. సినిమాల్లోకి రావడానికి ముందు నేను మోడలింగ్ చేసే దానిని. అలా నేను అందుకున్న తొలి పారితోషకం 300. మోడలింగ్ లో నాకంటూ ఒక గుర్తింపు రావడానికి నేను చాలా కష్టపడవలసి వచ్చింది. అలా కొన్ని యాడ్స్ లో నన్ను చూసిన దర్శకురాలు జయ.బి గారు, 'ప్రేమికులు' సినిమా కోసం నన్ను అడిగారు. అప్పుడు నేను ఇంటర్ చదువుతున్నాను. హైదరాబాద్ వచ్చి షూటింగు చేయాలంటే కొత్తగా అనిపించింది. కానీ ఆ సమయంలో మా మదర్ నన్ను ఎంతో ప్రోత్సహించింది. అలా నేను 'ప్రేమికులు' చేశాను.
ఆ తరువాత నాకు 'రణం' సినిమాలో అవకాశం వచ్చింది. ఈ సినిమా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. కొంతకాలం క్రితం నాకు వివాహమైంది .. ఆయన బిజినెస్ మేన్ .. మాకు ఇద్దరు పిల్లలు. కెరియర్ పరంగా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, తెలుగు .. తమిళ .. కన్నడ సినిమాలు చేశాను. ఇండస్ట్రీ లో తెలిసినవారు ఎవరూ లేకుండా వచ్చాను .. ఎంతో కష్టపడ్డాను .. ఈ మాత్రం గుర్తింపు తెచ్చుకున్నాను .. ఇది చాలు అనిపిస్తూ ఉంటుంది.
'కత్తి కాంతారావు' సినిమా షూటింగు సమయంలో అనుకుంటాను .. రఘుబాబు నన్ను బాగా ఆటపట్టించాడు. అప్పటికే నేను బాగా అలసిపోయాను. తరువాత చేయవలసిన సీన్ గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను. రఘుబాబు నా వెనుకే కూర్చుని తుమ్మడం నాకు చిరాకు తెప్పించింది. ప్రతిసారీ ఆయన 'సారీ' చెప్పడం .. మళ్లీ తుమ్మడం చేసేవారు. దాంతో నాకు చాలా కోపం వచ్చేసింది. తాను తుమ్మలేదనీ .. అలా సౌండ్ చేసింది ఇదే అంటూ ఆయన ఒక 'స్ప్రే' బాటిల్ చూపించారు. అప్పటివరకూ అందరూ ఎందుకు నవ్వుతున్నారో అప్పుడు నాకు అర్థమైంది" అంటూ చెప్పుకొచ్చింది.