Begin typing your search above and press return to search.

'నా భర్తకు సినిమాలంటే ఇష్టమే కానీ..' అంటూ మెగాడాటర్ క్లారిటీ!

By:  Tupaki Desk   |   15 Feb 2021 12:43 PM GMT
నా భర్తకు సినిమాలంటే ఇష్టమే కానీ.. అంటూ మెగాడాటర్ క్లారిటీ!
X
టాలీవుడ్ మెగాస్టార్‌గా చిరంజీవి స్టార్డం సంపాదించుకున్న తర్వాత మెగా ఫ్యామిలీ నుండి చాలామంది సినిమాలతో హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం స్టార్ హీరోలుగా వెలుగుతూ వారి స్టామినా నిరూపించుకున్నారు. అలాంటి వారిలో మెగాపవర్ స్టార్ రాంచరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముందు వరుసలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.

పవన్ కళ్యాణ్ సినిమాలే కాకుండా రాజకీయరంగంలో కూడా తన సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నాడు. మళ్లీ రాజకీయ విరామం తర్వాత సినిమాలలో వకీల్ సాబ్ తో ఎంట్రీ ఇవ్వనున్నాడు. అలాగే మెగామేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఆల్రెడీ హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు. అలాగే ఈ ఏడాది తన తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

మెగాబ్రదర్ కుమారుడు వరుణ్ తేజ్ వరుస సినిమాలతో మెల్లగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. అలాగే మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా ప్రస్తుతం సినిమాలలో తన అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. ఇదిలా ఉండగా.. మెగా డాటర్ నిహారిక సినీరంగంలో ప్రవేశించి కొంతకాలం తర్వాత పెళ్లి చేసుకుంది. అయితే నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డతో వివాహం జరిగాక అతను కూడా హీరోగా సినిమాలలో ఎంట్రీ ఇస్తాడని పుకార్లు వైరల్ అయ్యాయి.

అందులో కొన్ని కథనాలు ఫస్ట్ ప్రాజెక్ట్ ప్రారంభం అయిందని రాసుకొచ్చాయి. కానీ అవన్నీ నిజం కాదని నిహారిక క్లారిటీ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ.. చైతన్యకు సినిమాలంటే చాలా ఇష్టం. కానీ చూడటం వరకే నటించడం ఆయనకు ఇంటరెస్ట్ లేదు. త్వరలోనే నటుడు అవుతాడనే వార్తలలో నిజం లేదు" అంటూ క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం నిహారిక ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది.