Begin typing your search above and press return to search.

కటిఫ్ కి కారణం అదికాదంటున్న అజయ్!

By:  Tupaki Desk   |   10 Oct 2016 11:40 AM GMT
కటిఫ్ కి కారణం అదికాదంటున్న అజయ్!
X
ఒక సినిమా డైరెక్టర్ కీ - నటీనటులకు బందం ఎంత బలంగా ఉంటే అంత ఎక్కువగా అవకాశాలు వస్తాయనేది జగమెరిగిన సత్యమే. ఈ విషయంలో తెరపైన హీరో - హీరోయిన్స్ కెమిస్ట్రీ ఎంత ముఖ్యమో, తెర బయట కూడా హీరో - హీరోయిన్ - డైరెక్టర్ ల మధ్య అనుబంధం అంత ముఖ్యం. కాసేపు ఆ విషయం పక్కనపెడితే... బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కరణ్ జోహార్ - స్టార్ హీరోయిన్ కాజోల్ ఎంతో మంచి స్నేహితులు అనేది అందరికీ తెలిసిన విషయమే! అయితే, ఈ మధ్య అనుకోకుండా కరణ్ జోహార్‌ తో కాజోల్ ఫ్రెండ్ షిప్ కట్ అయిపోయిందట. ఈ విషయాన్ని స్వయంగా కాజోల్ భర్త అజయ్ దేవగనే చెప్పారు!

కరణ్ జోహార్ - కాజోల్ మధ్య నాటి స్నేహం గురించి, అది నేడు కటీఫ్ అయిపోయిందనే విషయం గురించి స్పందించిన అజయ్ దేవగన్... తనకూ కరణ్‌ కు మధ్య పెద్ద స్నేహం ఏమీ లేదని, ఆ మాటకొస్తే కరణ్‌ తో కాజోల్‌ కు కూడా ఒకప్పుడున్న గొప్ప అనుబంధం ఏమీ లేదని చెప్పాడు. కరణ్ కు తమకు మద్య గొడవలకు - మనస్పర్ధలకూ కారణం సినిమాల పోటీ కాదని కేవలం వ్యక్తిగత విషయాలే కారణం అని చెబుతున్నాడు.

అయితే, అజయ్ దేవగన్ సినిమా "శివాయ్" - కరణ్ సినిమా "ఏ దిల్ హై ముష్కిల్" ఈ దీపావళికి బాక్సాఫీస్ రేసులో నిలవబోతున్నాయి. అయితే ఈ అజయ్ సినిమా "శివాయ్"కు వ్యతిరేకంగా ప్రచారం చేయాలంటూ కరణ్ తనకు రూ. 25 లక్షలు ఇచ్చాడని కమల్ ఆర్.ఖాన్ అనే ఒక క్రిటిక్ ఫోన్లో చెబుతున్న ఆడియోను ఈ మధ్యే అజయ్ రిలీజ్ చేశాడు. దీనిపై పెద్ద వివాదమే నడిచింది. దీంతో అజయ్ చేసిన వ్యాఖ్యలకు కారణం ఇదే అని అంతా భావించారు. కానీ కానీ తమ మధ్య సంబంధాలు దెబ్బ తినడానికి సినిమాలు కారణం కాదని చెబుతున్నాడు అజయ్. దీంతో మరేమి కారణం అబ్బా... అంటూ బాలీవుడ్ జనాలు తెగ డిషక్షన్స్ చేసేస్తున్నారట.

కాగా కరణ్ తొలి సినిమా "కుచ్ కుచ్ హోతా హై"లో కాజోలే హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత కూడా కరణ్ సినిమాల్లో తరచుగా కనిపించే కాజోల్... కభీ ఖుషీ కభీ గమ్ - మై నేమ్ ఈజ్ ఖాన్ సినిమాల్లోనూ కథానాయికగా నటించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/