Begin typing your search above and press return to search.
నా పిల్లలు మాదక ద్రవ్యాల బానిసలు కాదన్న స్టార్ హీరో
By: Tupaki Desk | 17 Feb 2021 6:30 AM GMTఇటీవలి కాలంలో యువహీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానంతరం బాలీవుడ్ లో వ్యసనాలపై అతి పెద్ద డిబేట్ స్టార్టయ్యింది. ఈ డిబేట్ సారాంశం ఏమంటే పరిశ్రమలో ప్రతి స్టార్ కిడ్ డ్రగ్స్ కి బానిసలే. నటవారసులు తమ తండ్రుల ఆస్తుల్ని ఫుల్ గా ఎంజాయ్ చేసేందుకు ఇలాంటి హ్యాబిట్స్ కి అలవాటు పడుతుంటారని కూడా సోషల్ మీడియాల్లో విమర్శలు కనిపించాయి.
కంగన లాంటి స్టార్లు అయితే నేరుగానే స్టార్ కిడ్స్ ని విమర్శిస్తూనే ఉంటారు. అయితే స్టార్ వారసులందరినీ ఒకేగాటన కట్టేసి ఇలా వ్యాఖ్యానించడాన్ని మాత్రం చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఇక బాలీవుడ్ ప్రముఖ హీరో సునీల్ శెట్టి అసలే అంగీకరించడం లేదు. పైగా తన పిల్లల్ని ఆయన వెనకేసుకొచ్చారు. వారికి ఎలాంటి చెడు అలవాట్లు లేవని అన్నారు.
సునీల్ శెట్టి తాజా చాటింగ్ సెషన్ లో సమాజంలో తన పిల్లల గుర్తింపు గురించి ఆందోళన చెందుతున్నానని చెప్పారు. తన సంతానం అథియా - అహన్ అందమైన మంచి పిల్లలు అని ఆయన అన్నారు. కానీ సమాజంలో స్టార్ వారసులపై దురభిప్రాయం ఉండడం బెంగ పెంచుతోందని అన్నారు. ``నా పిల్లల జీవన విధానం గురించి నేను చింతించను. సాధారణంగా పరిశ్రమలో నా పిల్లల గురించి ఆందోళన చెందుతున్నాను.
ఎందుకంటే ప్రతి పరిశ్రమ పిల్లవాడిని డ్రగ్గీ అనేస్తున్నారు. కానీ మేం అలా కాదు. ఇక్కడ మంచి వ్యక్తులు కూడా ఉన్నారు. మేము సామాజికంగా ఉంచాం. ఈ విషయం పై కుండబద్ధలు కొట్టేందుకు నేను సిద్ధం. ఒక మంచి స్నేహపూర్వక వాతావరణానికి నా మద్ధతు ఎప్పుడూ ఉంటుంది``అని సునీల్ శెట్టి అన్నారు. అలాగే పరాజయాలు వచ్చినా ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని ఒకరి వ్యక్తిగత జీవితంలోకి వచ్చే హక్కు లేదని కూడా సునీల్ శెట్టి అన్నారు. నేను నేనే.. సునీల్ శెట్టిని అని కాన్ఫిడెన్స్ ని వ్యక్తం చేశారు.
జనాదరణ పెరుగుతున్నప్పుడు సెలబ్రిటీ పిల్లలు ఖచ్చితంగా కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. వారు మామూలు జీవనం గడపలేరు. గోప్యతను కోల్పోతారు. కానీ ప్రతి స్టార్ కిడ్ ని చెడిపోయారు అనడం సరికాదు.. అలా పిలిస్తే తల్లిదండ్రులలో ఆందోళన కలుగుతుంది.. అని నెటిజనుల ధోరణిపై ఆవేదన వ్యక్తం చేశారు.
సునీల్ శెట్టి కుమార్తె అతియాకు ఇప్పటికే బాలీవుడ్ లో మూడు సినిమాలు చేశారు. కుమారుడు అహన్ శెట్టి తెలుగు బ్లాక్ బస్టర్ `ఆర్ఎక్స్ 100` హిందీ రీమేక్ తో తొలి అడుగు వేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో సునీల్ శెట్టి బిజీగా ఉన్నారు. తన కొడుకు అరంగేట్రం కూడా తనను ప్రభావితం చేస్తుందని సీనియర్ నటుడు సునీల్ శెట్టి తెలిపారు. నా కొడుకు చాలా మంచివాడు. అతను కొంత మంచి నటన చేసినా ప్రజలు కామెంట్ చేస్తాడు. అతడు బంగారమంటి హృదయం ఉన్న పిల్లాడు.. అంటూ పుత్ర వాత్సల్యాన్ని కురిపించాడు.