Begin typing your search above and press return to search.
అప్పుడు 96.. అమ్మే గుర్తు పట్టలేక పోయింది
By: Tupaki Desk | 12 Dec 2018 12:49 PM GMTస్టార్ కిడ్ గా సారా అలీ ఖాన్ కు బాలీవుడ్ ఎంట్రీ చాలా సునాయాసంగా దక్కింది. తండ్రి సైఫ్ అలీ ఖాన్ ప్రోత్సాహంతో హీరోయిన్ గా ఇటీవలే పరిచయం అయిన సారా అలీ ఖన్ మొదటి సినిమా అటు ఇటు అయినా నటిగా మాత్రం నిరూపించుకుంది. స్టార్ కూతురు అవ్వడంతో మంచి నటినంటూ నిరూపించుకుంది. ఈ సమయంలోనే ఈమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ సరసన చేరగల సత్తా సారా అలీ ఖాన్ కు ఉందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈమద్య తెగ ఇంటర్వ్యూలతో సందడి చేస్తున్న సారా తాజాగా మరో ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెళ్లడి చేసింది.
సారా మాట్లాడుతూ.. తాను చిన్నప్పటి నుండి చాలా బొద్దుగా ఉండేదాన్ని, తిండి అంటే బాగా ఇష్టం అవ్వడం వల్ల అడ్డు అదుపు లేకుండా చిన్నప్పటి నుండి లావు అయ్యాను. అమెరికా వెళ్లిన సమయంలో మరీ ఎక్కువ లావు అయ్యాను. అమెరికాలో చదువుకునే సమయంలో తాను ఏకంగా 96 కేజీలకు బరువు పెరిగాను. అమెరికాలో ఉన్న సమయంలోనే నేను హీరోయిన్ అవుతాను అంటూ అమ్మతో చెప్పాను. అప్పుడు అమ్మ మొదట బరువు తగ్గు ఆ తర్వాత హీరోయిన్ అవుదువుగాని అంది.
అప్పుడే నేను హీరోయిన్ అవ్వాలనే పట్టుదలతో ఆహారపు అలవాట్లు మార్చుకుని బరువు తగ్గాను. అమెరికా నుండి ఇండియాకు తిరిగి వచ్చిన సమయంలో నేను చాలా బక్కగా అయ్యాను. నన్ను ఎయిర్ పోర్ట్ లో అమ్మ గుర్తు పట్టలేక పోయింది. నేను పట్టుకున్న బ్యాగ్ ను చూసి అప్పుడు అమ్మ నన్నుగా గుర్తించింది. అంత వ్యత్యాసంకు నా స్నేహితులు కూడా షాక్ అయ్యారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సారా చాలా నాజూకుగా అందంగా కనిపిస్తోంది.