Begin typing your search above and press return to search.

మా అమ్మనే నా బెస్ట్ ఫ్రెండ్: నిహారిక కొణిదెల

By:  Tupaki Desk   |   10 May 2022 1:30 AM GMT
మా అమ్మనే నా బెస్ట్ ఫ్రెండ్: నిహారిక కొణిదెల
X
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన నిహారిక యాంకర్ గా .. నటిగా .. వెబ్ సిరీస్ ల నిర్మాతగా మంచి పేరు తెచ్చుకుంది. నిహారిక నాన్న కూచిలా కనిపించినప్పటికీ, అమ్మ అంటే అంతకంటే ఎక్కువ ప్రేమనే. 'మదర్స్ డే' సందర్భంగా తన తల్లితో పాటు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన మనసులోని భావాలను .. తల్లితో తనకి గల అనుబంధాన్ని గురించి ప్రస్తావించింది. "నాన్న .. నేను ఫిల్టర్ లేకుండా మాట్లాడుకుంటాము. అలాంటి మా నాన్నకి కూడా తెలుసు .. నేను అమ్మతోనే ఎక్కువ క్లోజ్ గా ఉంటానని. చిన్నప్పుడు నాన్నతో ఎక్కువగా ఉన్నప్పటికీ, ఒక ఏజ్ కి వచ్చిన తరువాత మదర్ ను మించిన బెస్ట్ ఫ్రెండ్ ఉండదు.

చిన్నప్పుడు నేను పెద్దగా చదువేదానిని కాదు .. టీచర్ బోర్డు పై రాసినవి నోట్ బుక్ లో రాసేధానిని కాదు. ఆ సమయంలో పక్కన కూర్చున్న ఫ్రెండ్స్ తో ఎక్కువగా మాట్లాడుతూ ఉండేదానిని. దాంతో బ్రేక్ సమయానికి మా అమ్మ మా స్కూల్ కి వచ్చి నాతో తినిపించేది. నా నోట్స్ లు కూడా తనే రాసేది. నేను .. మా అన్నయ్య ఎక్కువగా గొడవపడేవాళ్లం. ఆ సమయంలో అమ్మ వరుణ్ ను సపోర్ట్ చేసినప్పటికీ, నన్ను ఏమీ అనేది కాదు. అమ్మ నన్ను ఎప్పుడూ కోప్పడేది కాదు. ఎక్కడికి వెళ్లినా ఇద్దరం కలిసే వెళుతుంటాము.

మా ఫ్రెండ్స్ కూడా వాళ్లింట్లో ఏదైనా ఫంక్షన్ అయితే మా అమ్మను కూడా పిలుస్తుంటారు. ప్రస్తుతం నేను వరుసగా వెబ్ సిరీస్ లను చేస్తున్నాను. వాటి ప్రొడక్షన్ కి సంబంధించిన పనులతో బిజీగా ఉన్నాను. ఒక వైపున వెబ్ సిరీస్ ల ప్రొడక్షన్ పెట్టుకుని మరో వైపున సినిమాలు చేయలేము. సినిమాల కోసం అవుట్ డోర్ కి కూడా వెళ్లవలసి ఉంటుంది. అది ఇప్పుడు కుదరదు.

అందువల్లనే సినిమాల సంఖ్యను తగ్గించడం జరిగింది. నాన్న చేసిన కొన్ని సినిమాలు పెద్దగా కలిసి రాలేదు .. అంతమాత్రాన ఆయన బ్యాడ్ ప్రొడ్యూసర్ అని చెప్పలేం. ఆయనలా చేయకూడదని నేనేమీ అనుకోవడం లేదు.

నాన్నను చూసే నేను ప్రొడక్షన్ వైపు వచ్చాను. నాకున్న అనుభవంతో ఒక్కో ప్రాజెక్టు చేసుకుంటూ వెళుతున్నాను. నేను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే ఎట్లా అని చెప్పేసి మా అమ్మ చాలా బాధపడుతూ ఉండేది. కానీ నా పెళ్లి కుదిరిన తరువాత తను చాలా హ్యాపీగా ఫీలైంది. నేను కూడా హైదరాబాద్ లోనే ఉంటాను అనే ఆనందం అమ్మలో చూశాను.

నేను అత్తగారింటికి వెళ్లినప్పటికీ, నా జిమ్ వచ్చేసి అమ్మ వాళ్ల ఇంటి దగ్గరే. అందువలన జిమ్ కాగానే మా ఇంటికి వచ్చేస్తూ ఉంటాను. అమ్మను .. నాన్నను కలిసి వెళుతుంటాను" అంటూ తల్లితో తనకి పైకి గల అనుబంధాన్ని గురించి నిహారిక చెప్పుకొచ్చింది.