Begin typing your search above and press return to search.

మమ్మీ బెస్ట్ అంటున్న పవర్ స్టార్ కొడుకు

By:  Tupaki Desk   |   4 Dec 2015 4:26 PM GMT
మమ్మీ బెస్ట్ అంటున్న పవర్ స్టార్ కొడుకు
X
డిసెంబర్ 4 పవర్ స్టార్ ఒకప్పటి హీరోయిన్, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ పుట్టిన రోజు. దీంతో ట్విట్టర్ లో ఆమె అభిమానులు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బోలెడన్ని విషెస్ చెబ్తున్నారు.

అన్ని విషెస్ కంటే.. ఓ అద్భుతమైన గిఫ్ట్ అందుకుంది రేణూ దేశాయ్. అదే కొడుకు కొణిదెల అకీరా నందన్ నుంచి విషెస్ చెబ్తూ ఓ లెటర్. తన లేఖలో అమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలే కాదు.. ఆమెతో తనకు ఎంతటి అనుబంధం ఉందో.. తన మమ్మీ తనకి ఎంత స్పెషలో చెప్పాడు అకీరా. "నువ్వు నన్ను తీసుకురాకపోతే.. నేను దేవుడి పాకెట్ లో దుమ్మూధూళిగా మిగిలియేవాడినమ్మా" అనే లైన్ చదివితే.. ఎవరికైనా మనసును తట్టినట్టుగా అనిపిస్తుంది. అకీరా లేఖ చివరలో రాసిన "ఈ మిలీనయంకు నువ్వు బెస్ట్ మమ్మీ " అనే వాక్యం బాగా ఆకట్టుకుంటుంది.

పవన్ తో విడిపోయాక.. కొడుకు అకీరా, కూతురు ఆద్యలతో కలిసి పూనేలో నివశిస్తోంది రేణూదేశాయ్. కొన్ని సినిమాల నిర్మాణం కూడా చేస్తోంది. మెగా ఫ్మామిలీకి చెందిన కొన్ని ఫంక్షన్లలోనూ, అప్పుడప్పుడూ షూటింగ్ స్పాట్ లలోనూ పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్. తల్లిదండ్రులిద్దరికీ పిల్లలు బాగా చేరిక అని చెబుతుంటారు దగ్గరివాళ్లు.