Begin typing your search above and press return to search.
బయోపిక్ తీస్తే అప్పుడు చెప్తా
By: Tupaki Desk | 28 Jan 2019 9:00 AM GMTబయోపిక్కుల ట్రెండ్ ఇప్పుడు యమా జోరుగా సాగుతోంది. నిజాలు.. అబద్దాలు.. కల్పితాలు.. దైవత్వాలు.. సినిమాటిక్ లిబర్టీలు.. ఇలా ఏది ఎందులో ఉంటుందో ఎవరికీ తెలియడం లేదుగానీ బయోపిక్ ల ఫీవర్ మాత్రం తగ్గడం లేదు. బాలీవుడ్ లో ఇది మరీ ఎక్కువ. తాజాగా Mr. పర్ఫెక్షనిస్ట్ ఒక ప్రెస్ మీట్ లో తన బయోపిక్ గురించి హింట్స్ ఇచ్చాడు.
అమీర్ ఖాన్ స్నేహితురాలు అయిన స్వాతి చక్రవర్తి భత్కల్ దర్శకత్వం వహించనున్న ఒక సినిమాను అమీర్ ఖాన్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు అమీర్ మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా తన స్నేహితురాలి గురించి మాట్లాడుతూ అప్పట్లో రీనాను ప్రేమ వివాహం చేసుకున్న సమయంలో స్వాతి తమ కు సహాయం చేసిందని గుర్తుచేసుకున్నాడు. ఇలాంటి హింట్ ఇచ్చిన తర్వాత రిపోర్టర్స్ ఊరుకోరు కదా.. ఆ తర్వాత ఏం జరిగిందని ప్రశ్నించారు. కానీ అమీర్ మాత్రం అస్సలు ఇన్ఫర్మేషన్ లీక్ చెయ్యకుండా తన జీవితంపై ఒక బయోపిక్ తీస్తే అప్పుడు చెప్తానంటూ మెలిక పెట్టాడు.
దీంతో బయోపిక్ టాపిక్ ను కంటిన్యూ చేస్తూ "ఒకవేళ మీ బయోపిక్ ను తెరకెక్కిస్తే ఎవరు మీ పాత్ర పోషిస్తారు?" అని ఒక జర్నలిస్ట్ అడిగారు. అమీర్ ఖాన్ తడుముకోకుండా "మా అబ్బాయి జునైద్ అయితే బెస్ట్ ఛాయిస్ అనుకుంటున్నాను" అన్నాడు. జునైద్ ఖాన్ ను త్వరలో హీరోగా లాంచ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈమధ్య బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై అమీర్ ఖాన్ మాట్లాడుతూ "జునైద్ యాక్టింగ్ కోర్స్ పూర్తి చేశాడు. దాదాపు ఏడాదికి పైగా థియేటర్ యాక్టింగ్ లో పాల్గొంటున్నాడు. తండ్రిగా నేను వాడికి ఒకే సలహా ఇస్తా. లీడ్ రోల్స్ మాత్రమే చెయ్యాలి అని చెప్తా గానీ అవి క్యారెక్టర్లు అయి ఉండాలి" అంటూ జూనియర్ ఖాన్ కు తన సలహా గురించి చెప్పుకొచ్చాడు. మరి ఎప్పుడు Mr. పర్ఫెక్షనిస్ట్ బయోపిక్ తెరకెక్కుతుందో ఏమోగానీ ఆల్రెడీ చర్చలు మాత్రం మొదలయ్యాయి.