Begin typing your search above and press return to search.
నా పెళ్లి వార్తలు నిజమేః హీరోయిన్
By: Tupaki Desk | 16 Feb 2021 3:30 AM GMT'హనీ ఈజ్ ద బెస్ట్' అంటూ.. ఎఫ్-2 సినిమాలో మెహ్రీన్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అంతకు ముందు రాని గుర్తింపు.. ఈ సినిమాతో కొట్టేసిందీ బ్యూటీ. ప్రస్తుతం-3 షూట్ లో బిజీగా ఉందీ చిన్నది. 'కృష్ణగాడి వీరప్రేమగాథ'తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ.. దాదాపు 17 తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.
కాగా.. తాజాగా ఈ అమ్మడి పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వీటిపై స్పందించిన ఈ బ్యూటీ.. తన పెళ్లి వార్తలు నిజమేనని ప్రకటించింది. తాను పెళ్లాడే వరుడు మరెవరో కాదు.. హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ భిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్. రాజస్థాన్‌లోని జైపుర్ అలీలా కోటలో మార్చి 13న వీరిద్దరి నిశ్చితార్థ వైభవంగా జరగనుంది.
జీవితంలో సరికొత్త ప్రయాణం ప్రారంభమవుతోందని చెప్పిన మెహ్రీన్.. ఈ సమయంలో తాను ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం అనిల్‌రావిపూడి తెరకెక్కిస్తోన్న 'ఎఫ్3'తో బిజీగా ఉందీ బ్యూటీ. మరి, పెళ్లి తర్వాత సినీ ప్రయాణం కొనసాగిస్తుందా? లేదా? అన్నది చూడాలి.