Begin typing your search above and press return to search.

నా పెళ్లి రెండు చోట్ల జరగాలి: సోనాల్

By:  Tupaki Desk   |   17 Jan 2021 2:12 PM GMT
నా పెళ్లి రెండు చోట్ల జరగాలి: సోనాల్
X
'సోనాల్ చౌహాన్..' తెలుగు ప్రేక్షకులకు ఈ బాలీవుడ్ బ్యూటీ సుపరిచితురాలే. తెలుగులో బాలకృష్ణ సరసన 'లెజెండ్', 'డిక్టేటర్' సినిమాల్లో నటించిందీ బీటౌన్ బ్యూటీ. ఇందులో లెజెండ్ సినిమా సూపర్ హిట్ కొట్టింది. అయినప్పటికీ.. ఈ అమ్మడికి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.

తరచూ బీచ్‌లో మెరుస్తూ కుర్రకారుకు బికినీ ట్రీట్ ఇస్తూ ఉంటుందీ చిన్నది. అయితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లి ఎలా జరగాలో, ఎలాంటి వ్యక్తి తన జీవితంలోకి రావాలని కోరుకుంటుందో చెప్పుకొచ్చింది. తనకు ప్రకృతి అంటే చాలా ఇష్టమని, తన వివాహం నేచర్ సాక్షిగా జరగాలని చెప్పుకొచ్చింది సోనాల్.

'ప్రకృతి అంటే నాకు చాలా ఇష్టం.ప్రకృతిని మించిన అందం ఇంకోటి లేదు. నా వివాహం రెండు చోట్ల జరగాలని ఆశిస్తున్నాను. సాగర తీరం ఓ వేదికగా, కొండ ప్రాంతం మరో వేదికగా నా వివాహం జరగాలని కోరుకుంటున్నా. కానీ ఇప్పటి వరకు నాకు నచ్చిన వ్యక్తి ఎదురు కాలేదు'అని చెప్పింది సోనాల్‌.