Begin typing your search above and press return to search.

తమిళ తెరపైకి మరో వారసురాలు వస్తోంది

By:  Tupaki Desk   |   21 Jun 2016 6:59 AM GMT
తమిళ తెరపైకి మరో వారసురాలు వస్తోంది
X
సినిమా ఇండస్ట్రీలో నడిచినంతగా వారసత్వం రాజకీయంలో తప్ప వేరెక్కడా ఉండదు. అన్ని భాషల్లోనూ ఈ స్టార్ కిడ్స్ దూసుకుపోతూ ఉంటారు. ఇప్పుడు ప్రముఖ సీనియర్ నటుడు రవిచంద్రన్ మనవరాలు తెరంగేట్రం చేస్తోంది. 100కు పైగా సినిమాల్లో నటించిన రవిచంద్రన్.. కేరక్టర్ ఆర్టిస్టుగా - డైరెక్టర్ గా కూడా పని చేశారు. ఆయన కొడుకు హంసవర్ధన్ కూడా సినిమాల్లో అదృష్టం పరీక్షించుకున్నా సక్సెస్ కాలేకపోయాడు.

ఇప్పుడు రవిచంద్రన్ గ్రాండ్ డాటర్ అభిరామి హీరోయిన్ గా మారుతోంది. డైరెక్టర్ మిష్కన్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం అభిరామి అనే ఈ చిన్నదాన్ని హీరోయిన్ గా బుక్ చేశాడు. అయితే.. అభిరామి అనే యాక్ట్రెస్ ఇప్పటికే ఉండడంతో.. ఈమెకు తాన్యా అంటూ రీనేమ్ చేశాడు మిష్కిన్. విశాల్ హీరోగా తుప్పరివాలన్ డైరెక్ట్ చేయనున్న మిష్కిన్.. అందులో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ని తీసుకున్న విషయం తెలిసిందే.

దీని తర్వాత తాన్యా హీరోయిన్ గా ఓ సినిమా తీస్తున్నట్లు మిష్కిన్ చెప్పాడు. యాక్టింగ్ తో పాటు భరతనాట్యం కూడా నేర్చుకున్న తాన్యా.. ఇప్పుడు మోడలింగ్ లో బిజీగానే ఉంది. యాక్టింప్ ఇంట్రెస్ట్ ఉందని చెప్పడంతో.. మిష్కిన్ ఆడిషన్ చేసి మరీ సెలక్ట్ చేశాడని తాన్యా చెబుతోంది. అయితే.. తనను ఇండస్ట్రీకి పరిచయం చేసేందుకు రవిచంద్రన్ పేరు ఉపయోగపడ్డా.. నిలదొక్కుకోవాలంటే ట్యాలెంట్ ముఖ్యమని తనకు తెలసని ఈ సుందరి చెబుతోంది. తాన్యా హీరోయిన్ గా పరిచయమయ్యే మూవీలో హీరోగా మైత్రేయ నటించనున్నాడు.