Begin typing your search above and press return to search.

సైరా: కెనడా షోల రద్దు వెనక పెద్ద కథ?

By:  Tupaki Desk   |   5 Oct 2019 5:49 PM GMT
సైరా: కెనడా షోల రద్దు వెనక పెద్ద కథ?
X
కెనడా దేశంలో ఒంటారియో ప్రావిన్స్ లో 'సైరా' చిత్రాన్ని ప్రదర్శిస్తున్న రెండు థియేటర్లలో ఒక ఆగంతకుడు సినిమా స్క్రీన్ ను చింపడం.. ప్రేక్షకులపై పెప్పర్ స్ప్రే చల్లడం ఓవర్సీస్ లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ముందుజాగ్రత్త చర్యగా సైరా ప్రదర్శిస్తున్న థియేటర్లలో షోల ప్రదర్శనలు రద్దు చేయడంతో ఈ ఇష్యూపై అందరి దృష్టి పడింది. వీకెండ్ సమయంలో ఇలా జరగడంతో డిస్ట్రిబ్యూటర్ కు నష్టాలు తప్పేలా లేవు.

అయితే ఇదంతా జరగడానికి వెనక చాలా పెద్ద కథే ఉందన్న టాక్ ఓవర్సీస్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. మిగతా ఓవర్సీస్ ఏరియాలకు కెనడాలో డిస్ట్రిబ్యూషన్ కు తేడా ఉందట. కెనడాలో డిస్ట్రిబ్యూషన్ కొందరి గుప్పిట్లో ఉందని.. వారిలో ముఖ్యంగా కొందరు తెలుగు.. తమిళ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారని సమాచారం. అయితే ఈ డిస్ట్రిబ్యూటర్లది ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా ఇంతకాలం సాగుతూ వచ్చిందట. కలెక్షన్స్.. టాక్సుల లెక్కలు కూడా వారు ఎంత చెప్తే అంతేనట.. ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న నిర్మాతలకు అసలు కలెక్షన్ల లెక్కలు ఎంతో తెలియడం లేదట. ఆ డిస్ట్రిబ్యూటర్ల ఓ రింగుగా ఫామ్ అయ్యేసరికి నిర్మాతలు ఎవరూ వారి జోలికి పోవడం లేదట.

అయితే 'సైరా' విషయం లో మాత్రం భిన్నంగా జరిగిందని.. ఆ లోకల్ డిస్ట్రిబ్యూటర్లకు రైట్స్ ఇవ్వకుండా డైరెక్ట్ గా మల్టిప్లెక్స్ చెయిన్ కు పంపిణీ హక్కులు ఇచ్చారని సమాచారం. ఇది 'సైరా' నిర్మాతలకే కాకుండా ఇతర తెలుగు.. తమిళ నిర్మాతలకు కూడా మంచి జరిగే విషయమట. ఎందుకంటే సైరా ఫుల్ రన్ కలెక్షన్స్.. థియేటర్ల కౌంట్ కనుక చూస్తె అసలు కెనడాలో కలెక్షన్స్ పరిస్థితిపై నిర్మాతలందరికీ ఒక అవగాహన వచ్చే అవకాశం ఉందట. దీంతో ఒక ముఠాగా ఏర్పడి నిర్మాతలకు నష్టం చేకూరుస్తున్న డిస్ట్రిబ్యూటర్లు ఈ స్క్రీన్ లు చింపడం.. పెప్పర్ స్ప్రే దాడి లాంటివి తెలివిగా ప్లాన్ చేసి.. టోటల్ గా 'సైరా' వీకెండ్ షోలు రద్దయ్యే పరిస్థితికి తీసుకొచ్చారట. దీంతో ఇప్పుడు కూడా కెనడాలో తెలుగు తమిళ సినిమాల కలెక్షన్స్ పరిస్థితిపై ఒక అంచనాకు రాలేని పరిస్థితే కొనసాగుతుంది. అక్కడ ముఠాగా ఏర్పడిన వారి ఆటలే చెల్లుతాయి. ఒకవేళ ఈ వెర్షన్ కనుక నిజమైన పక్షంలో టాలీవుడ్ నిర్మాతలు ఈ విషయంపై సీరియస్ గా దృష్టిసారించాల్సిన అవసరమైతే ఉంది.