Begin typing your search above and press return to search.

లైగ‌ర్ Rs.200 చప్పల్స్ వెనుక టాప్ సీక్రెట్ లీక్

By:  Tupaki Desk   |   4 Aug 2022 4:12 AM GMT
లైగ‌ర్ Rs.200 చప్పల్స్ వెనుక టాప్ సీక్రెట్ లీక్
X
ప్ర‌తిరోజు ఫ్యాష‌న్ అప్ డేట్ అవుతుంది. ట్రెండీ లుక్ తో ఫ్యాష‌నిస్టాలు గుబులు పుట్టించ‌డ‌మెలానో చూపిస్తున్నారు. ఇక మేల్ స్టార్స్ లో బాలీవుడ్ స్టార్ ర‌ణ‌వీర్ సింగ్ దేశంలోనే పాపుల‌ర్ ఫ్యాష‌న్ ఐక‌న్ గా వెలిగిపోతున్న సంగ‌తి తెలిసిందే. వైవిధ్య‌మైన లుక్ వెరైటీ కాస్ట్యూమ్స్ తో అత‌డు నిరంత‌రం మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తున్నారు. అతడికి శిష్యుడిగా విజ‌య్ దేవ‌ర‌కొండ సైతం టాలీవుడ్ హీరోల్లోనే యూనిక్ స్టైల్ తో యువ‌త‌రాన్ని ఆక‌ట్టుకుంటున్నాడు.

ప్ర‌తిసారీ పాత లుక్ ని రిపీట్ చేయ‌కూడ‌దు. అందుకే అత‌డు ఈసారి యూనిక్ గా క‌నిపించాల‌ని భావించాడు. దానిని `లైగ‌ర్` ట్రైల‌ర్ ఈవెంట్లో చూపించాడు. అయితే అత‌డు ఎంచుకున్న మార్గ‌మే అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అస‌లు రూ.200 ఖ‌రీదు చేసే అవాయి చెప్ప‌ల్స్ తో అత‌డు కనిపించాడం షాక్ కి గురి చేసింది. ఈ వేదిక‌పై ర‌ణ‌వీర్ సైతం విజ‌య్ చ‌ప్ప‌ల్స్ గురించి ప్ర‌స్థావించి ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేశాడంటే అర్థం చేసుకోవాలి.

అయితే దీనివెన‌క టాప్ సీక్రెట్ ఏదైనా ఉందా? అన్న‌ది ఆరా తీస్తే అస‌లు సంగ‌తి తెలిసింది. విజయ్ దేవరకొండ లైగ‌ర్ ప్రమోషన్స్ లో రూ. 200 చప్పల్స్ ధరించడం వెనుక రహస్యం ఇప్పుడు తెలిసింది. విజ‌య్ ముంబై న‌గ‌రంలో ప్ర‌చారంలోనూ ఎక్క‌డికి వెళ్లినా రూ. 200 విలువ చేసే గ్రే చప్పల్స్ ధరించి కనిపిస్తున్నాడు. అయితే అత‌డు పాపుల‌ర్ బ్రాండ్ లను వదిలేసి అవాయి చెప్ప‌ల్స్ నే ధ‌రించ‌డం వెనుక ఉన్న ఆలోచన ఏమిటి? అన్న‌ది ప‌ర్స‌న‌ల్ స్టైలిస్ట్ హార్మ‌న్ కౌర్ వెల్ల‌డించారు.

విజయ్ దేవరకొండ చప్పల్స్ నే ఎంపిక చేయ‌డం వెనుక మిస్టరీని హార్మ‌న్ రివీల్ చేశారు. ప్రమోషన్స్ సమయంలో విజయ్ లుక్ సినిమాలో తన పాత్రతో సింక్ అయ్యేలా చూడాల‌న్న‌ది ప్లాన్‌. అది విజ‌య్ ఆలోచ‌న అని స్టైలిస్ట్ తెలిపారు. ``విజయ్ ఒకరోజు నన్ను పిలిచి పాత్రకు దగ్గరగా ఉండి పూర్తి అండర్ డాగ్ లుక్ లో ఉంచుదాం అని చెప్పేంత వరకు నాకు ఈ ఆలోచ‌న లేదు. నేను నిజంగా అత‌డి ఫ్యాష‌న్ ని పీక్స్ లో ఆవిష్క‌రించాల‌ని భావించాను. కానీ అత‌డు ప్రత్యేకంగా ప్రైమ‌రీ ఖ‌రీదు చప్పల్స్ ధ‌రిస్తాన‌ని అన‌గానే మొదట్లో నేను కొంచెం సంకోచించాను. కానీ విజయ్ డ్రెస్సింగ్ సెన్స్ ఇత‌ర ఆలోచనలను నేను ఎప్పుడూ విశ్వసిస్తాను. ఎందుకంటే అతను దానిని దేశంలోనే చర్చనీయాంశంగా మారుస్తాడని నాకు తెలుసు`` అని అన్నారు.

విజయ్ దేవరకొండ కారణంగానే గ్రే అవాయి చప్పల్స్ నిజంగా పాపుల‌ర‌య్యాయి. వాస్తవానికి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కనిపించినప్పుడు రణవీర్ సింగ్ కూడా వాటిని గమనించాడు. చ‌ప్ప‌ల్స్ తో ఫ్యాష‌న్ అంటూ అత‌డు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశాడు. హార్మ‌న్ కౌర్ సౌత్ లో పాపుల‌ర్ స్టైలిష్ట్. అల్లు అర్జున్ కి కూడా త‌నే స్టైలింగ్ చేస్తుంటారు. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు స్టైలిష్ట్ గా కొన‌సాగుతున్నారు.

విజయ్ బాలీవుడ్ అరంగేట్ర చిత్రం లైగ‌ర్ 25 ఆగస్ట్ 2022న విడుదల కానుంది. ఈ చిత్రంలో విజ‌య్ MMA ఫైటర్ పాత్రను పోషిస్తున్నారు. అన‌న్య పాండే అత‌డి ల‌వ‌ర్ గా న‌టిస్తోంది. ఇందులో అమెరికన్ బాక్సర్ మైక్ టైసన్ కీల‌క పాత్ర‌ను పోషించారు. ముంబై మీడియాలో క్రేజ్ ని బట్టి చూస్తే ఈ సినిమా హిట్ అవుతుందని స్థానికంగా క‌థ‌నాలు వెలువ‌డ‌డం ఆస‌క్తిక‌రం.